ETV Bharat / state

నిజంగా నిజం: ఆ డ్రస్ ఖరీదు రూ.5లక్షలట! - 5 లక్షల డ్రస్

హైఓల్టేజీతో ప్రవహించే విద్యుత్ తీగలకు మరమ్మతులు చేసేందుకు రూపొందించిన ఈ డ్రస్సు ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!. ఎందుకంటే ఆ దుస్తుల ఖరీదు అక్షరాల 5 లక్షల రూపాయలు. ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ విద్యుత్ ఉపకేంద్రంలో మరమ్మతుల కోసం ఈ ప్రత్యేకమైన డ్రస్​ను విదేశాల నుంచి తెప్పించారు.

this-dress-is-so-expensive
రూ.5 లక్షల ఖరీదైన విద్యుత్​ 'డ్రస్​'..!
author img

By

Published : Feb 9, 2020, 1:53 PM IST

రూ.5 లక్షల ఖరీదైన విద్యుత్​ 'డ్రస్​'..!

ఆంధ్రప్రదేశ్​ కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని విద్యుత్ ఉపకేంద్రానికి విద్యుత్ సరఫరా చేసే 132 వేల కిలో వాట్ల సామర్థ్యం ఉన్న తీగ జంపర్ తెగిపోయింది. ఈ సమయంలో మరమ్మతులు చేయాలంటే తప్పనిసరిగా విద్యుత్​ను నిలిపివేయాల్సిందే. అలా చేస్తే విద్యుత్ సంస్థకు లక్షల రూపాయల మేరనష్టం వాటిల్లుతుంది.

ఈ నష్ట నివారకు చర్యలు చేపట్టిన విద్యుత్ అధికారులు.. విదేశాల నుంచి 5 లక్షలు వెచ్చించి ప్రత్యేక దుస్తులను తెప్పించారు. మరో 30 లక్షలు ఖర్చుచేసి ప్రత్యేక నిచ్చెన ద్వారా బేర్ హ్యాండ్ టెక్నాలజీని ఉపయోగించి మరమ్మతులు చేపట్టారు. అంత తీవ్రతతో విద్యుత్ సరఫరా అవుతున్నా... ఈ ప్రత్యేకమైన ఏర్పాట్ల ద్వారా మరమ్మతులు చేయగలిగామని విద్యుత్ అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: తెరపై విద్యుత్‌ చిత్రం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.