ETV Bharat / state

ఒడిశాకు బయల్దేరిన మూడో ఆక్సిజన్ ఎక్స్​ప్రెస్ - తెలంగాణ వార్తలు

దక్షిణ మధ్య రైల్వే మూడో ఎక్స్​ప్రెస్ ఆక్సిజన్ కోసం సనత్​నగర్ నుంచి ఒడిశాకు బయల్దేరింది. ఐదు ఖాళీ ట్యాంకర్లతో కూడిన ఎక్స్​ప్రెస్​ ద్రవరూప ఆక్సిజన్​తో తిరిగి రానుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆక్సిజన్‌ అవసరాలను తీర్చే క్రమంలో ద.మ.రైల్వే ఈ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించింది.

Third Oxygen Express started from hyderabad,  Third Oxygen Express
హైదరాబాద్​ నుంచి బయల్దేరిన ఆక్సిజన్ ఎక్స్​ప్రెస్​, ఆక్సిజన్ ఎక్స్​ప్రెస్
author img

By

Published : May 9, 2021, 7:41 PM IST

దక్షిణ మధ్య రైల్వే మూడో ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఇవాళ సనత్‌నగర్‌ న్యూ గూడ్స్‌ కాంప్లెక్స్‌ నుంచి ఒడిశాకు బయలుదేరింది. ఐదు ఖాళీ ట్యాంకర్లతో కూడిన ఈ ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఒడిశాలోని మెసర్స్‌ టాటా స్టీల్‌ బీఎస్‌ఎల్‌ లిమిటెడ్​కు చేరనుంది. ఈ ట్యాంకర్లలో ద్రవ రూప వైద్య ఆక్సిజన్‌ నింపుకుని తిరిగి వస్తుందని ద.మ.రైల్వే వెల్లడించింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆక్సిజన్‌ అవసరాలను తీర్చే క్రమంలో ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించింది.

రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థనతో రెండు ఎక్స్‌ప్రెస్​లను నడిపి హైదరాబాద్‌కు ఆక్సిజన్‌ను చేరవేసింది. ఇప్పుడు మూడో ఖాళీ ఎక్స్‌ప్రెస్‌ను పంపింది. ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ నిర్వహణకు జోన్‌ ముందస్తుగా జంటనగరాల్లో సమర్థవంతమైన స్టేషన్లను గుర్తించింది. ఆక్సిజన్ ఎక్స్​ప్రెస్ కోసం గ్రీన్‌ కారిడార్‌ను సిద్ధం చేసింది. ట్యాంకర్ల రవాణాలో ఎత్తు ప్రధానమైన అంశం. మార్గంలోని రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జి, ఫ్లాట్‌ఫారం పైకప్పు, ఓవర్‌ హెడ్‌ ఎక్విప్‌మెంట్‌ మొదలగు వాటిని పరిగణలోకి తీసుకొని మ్యాప్‌ను సిద్ధం చేశారు. ఆక్సిజన్ ప్రాముఖ్యతను గుర్తించి ఈ రైళ్ల రవాణాను ఉన్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.

ఇదీ చదవండి: కింగ్ కోఠి ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందక ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.