హైదరాబాద్లోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయిపురి కాలనీలో చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూలేని సమయంలో తాళాలు పగులగొట్టిన దుండగులు సుమారు 15 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. అనంతరం ఇంటికొచ్చిన యజమానులు లబోదిబోమంటూ పోలీసులు ఆశ్రయించారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
ఇవీ చూడండి: అద్దంకి- నార్కట్పల్లి హైవేపై రోడ్డుప్రమాదం