ఏపీలోని రాజమహేంద్రవరానికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి రెండేళ్ల కిందట నగరానికొచ్చాడు. కేపీహెచ్బీ కాలనీలో ఉంటూ పిల్లలకు టెన్నిస్లో శిక్షణ ఇస్తానంటూ నమ్మబలికేవాడు. పలువురితో పరిచయాలు ఏర్పరచుకుని అవకాశం కోసం ఎదురుచూసేవాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చొరబడి దొరికిన సొత్తు ఎత్తుకెళ్లేవాడు.
ఇలా చిక్కాడు
సర్దార్పటేల్నగర్ కాలనీకి చెందిన బాధితులు తీర్థయాత్రలకు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన రామకృష్ణ ఇంట్లో చొరబడి బంగారం, వెండి ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు దోచుకెళ్లాడు. బాధితుల తిరుగొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు రామకృష్ణను అదుపులోకి తీసుకొని రూ. 5లక్షల పైగా విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.