ETV Bharat / state

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో.. సమయం తినే ప్రశ్నలే అధికం! - జేఈఈ అడ్వాన్స్​డ్​ తాజా వార్తలు

లక్షలాది మంది కలల పరీక్ష జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఆదివారం ముగిసింది. ఐఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి నిర్వహించిన ఈ పరీక్షలో ఈసారి అధిక సమయం తీసుకునే ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయి. పేపర్‌-2 ప్రశ్నలు సులభంగా ఉన్నా.. పూర్ణాంకాలు(ఇంటిజర్‌), సాంఖ్యాత్మక విలువ(న్యూమరికల్‌...పాయింట్లలో) జవాబులు ఉన్న ప్రశ్నలు ఎక్కువగా ఉండటంతో ఎక్కువ సమయం తిన్నాయి. దాంతో అత్యధిక శాతం మంది 3 గంటల్లో అన్నింటికీ జవాబులు గుర్తించడం కష్టమని నిపుణులు చెబుతున్నారు.

JEE
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో.. సమయం తినే ప్రశ్నలే అధికం!
author img

By

Published : Sep 28, 2020, 8:19 AM IST

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో మొత్తంమీద భౌతికశాస్త్రం ప్రశ్నలు కఠినంగా ఉన్నాయని.. గణితం మధ్యస్తంగా ఉన్నాయని నిపుణులు, విద్యార్థులు అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా జరిగిన అడ్వాన్స్‌డ్‌ పేపర్‌-1కు 1,51,311 మంది, పేపర్‌-2కు 1,50,900 మంది హాజరయ్యారు. రెండు పేపర్లు రాస్తేనే హాజరైనట్లుగా పరిగణిస్తారు. అంటే 1,50,900 మంది మాత్రమే పరీక్ష రాసినట్లు పరిగణిస్తారు. మొత్తం 96 శాతం మంది పరీక్షకు హాజరయ్యారని అడ్వాన్స్‌డ్‌ పరీక్ష నిర్వహించిన ఐఐటీ దిల్లీ తెలిపింది. మొత్తం 222 నగరాలు/పట్టణాల్లో 1001 పరీక్ష కేంద్రాల్లో విజయవంతంగా పరీక్ష జరిగిందని ఐఐటీ దిల్లీ సంచాలకుడు ఆచార్య వి.రాంగోపాల్‌రావు తెలిపారు.

ఒక్కో పేపర్‌ 198 మార్కులకు...

ఒక్కో పేపర్‌లో గణితం, భౌతిక, రసాయనశాస్త్రాలలో ఒక్కో సబ్జెక్టుకు 18 చొప్పున మొత్తం 54 ప్రశ్నలు ఇచ్చారు. ఒక్కో సబ్జెక్టుకు 66 మార్కుల చొప్పున, మూడు సెక్షన్లకు కలిపి 198 మార్కులు. అంటే రెండు పేపర్లు కలిపి మొత్తం 396 మార్కులు. జనరల్‌ కేటగిరీకి 35 శాతం అంటే 139 మార్కులు కటాఫ్‌ ఉండొచ్చని నిపుణుల అంచనా. ఓబీసీలకు 30 శాతం, ఎస్‌సీలకు 15 శాతం ఉంటుందని భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కొందరు విద్యార్థులకు 360 మార్కులు దాటవచ్చని జేఈఈ నిపుణులు చెబుతున్నారు. 300 మార్కులు దాటిన వారికి 100లోపు ర్యాంకు వస్తుందని అంచనా వేస్తున్నారు.

వారంలోగా ర్యాంకులు

అక్టోబరు 5వ తేదీన అంటే వారం రోజుల్లో అడ్వాన్స్‌డ్‌ ర్యాంకులు వెల్లడించనున్నారు. కటాఫ్‌ మార్కులు సాధించిన వారికి మాత్రమే ఐఐటీ ప్రవేశాల కౌన్సెలింగ్‌కు హాజరుకావొచ్చు. ఐఐటీల్లో దాదాపు 13,600 సీట్లు ఉండగా దానికి కనీసం మూడు రెట్లు మంది ఎంపికయ్యేలా చూస్తారు. అంటే దాదాపు 41 వేల మంది కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు అవకాశం ఉంటుంది. అక్టోబరు 6 నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొదలవుతుంది.

ప్రశ్నల తీరిదీ...

పేపర్‌-1లో ఒకటే కచ్చితమైన జవాబున్న ప్రశ్నలు ఆరు , ఒకటి కంటే ఎక్కువ సరైన జవాబులున్నవి ఆరు, పూర్ణాంకాలు(0-9 మధ్యలో ఏదో ఒక అంకె జవాబు అవుతుంది) ప్రశ్నలు ఆరు ఉన్నాయి. పేపర్‌-2లో మొత్తం 36 పూర్ణాంకాలు, సాంఖ్యాత్మాక విలువ ఉన్న ప్రశ్నలు ఇచ్చారని జేఈఈ నిపుణుడు ఎం.ఉమాశంకర్‌ చెప్పారు. దానివల్ల పేపర్‌-2లో జవాబులను గుర్తించడానికి ఎక్కువ సమయం పడుతుందని తెలిపారు. అందుకే అన్ని ప్రశ్నలకు జవాబులు గుర్తించేవారు తక్కువ మంది ఉంటారన్నారు. ప్రశ్నలపరంగా చూస్తే పేపర్‌-1 కష్టంగా ఉందన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.