కర్ణాటక ఉత్తర ప్రాంతంలో 900 మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మరోవైపు ఆ రాష్ట్రంలోని కోస్తా ప్రాంతం నుంచి తమిళనాడు ఉత్తర ప్రాంతం వరకూ 1500 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఉంది. వీటి ప్రభావంతో తెలంగాణలో నేడు, రేపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 128 చోట్ల వర్షాలు కురిశాయి.
తస్మాత్ జాగ్రత్త: నేడు, రేపు వర్షాలు
తెలంగాణలో నేడు, రేపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 128 చోట్ల వాన కురిసిందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.
రాష్ట్రంలో నేడూ రేపూ వర్షాలు