ETV Bharat / state

Telangana Rains : రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో వర్షం

Telangana Rains : రాష్ట్రంలో చలికి గజగజ వణుకుతున్న ప్రజలను.. గత రెండు రోజులుగా వరుణుడు వానజల్లులతో పలకరిస్తున్నాడు. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Telangana Rains, weather report
మూడు రోజులపాటు ఉరుములు మెరుపులతో వర్షం
author img

By

Published : Jan 12, 2022, 3:02 PM IST

Telangana Rains : రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళవారం ఉత్తర కొంకణ్‌ పరిసర ప్రాంతాల నుంచి ఝార్ఖండ్ వరకు 1.5కిమీ ఎత్తు వద్ద ఉన్న ఉపరితల ద్రోణి బుధవారం బలహీనపడిందని తెలిపింది.

మరో 3 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సిద్దిపేట, జనగామ, యాదాద్రి జిల్లాలతో పాటు... ఖమ్మం, సంగారెడ్డి, నల్గొండ, మెదక్, సూర్యాపేట జిల్లాల్లో వాన కురిసే అవకాశం ఉందని తెలిపింది.

కర్ణాటక నుంచి ఉత్తర మధ్య మహారాష్ట్ర వరకు ఉన్న ఉపరితల ద్రోణి... నేడు దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక నుంచి రాయలసీమ, తెలంగాణ మీదుగా దక్షిణ ఛత్తీస్​గఢ్ వరకు సగటు సముద్రమట్టం నుంచి 0.9కిమీ ఎత్తు వద్ద కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ సంచాలకులు వివరించారు.

ఇదీ చదవండి: Corona in IIT Hyderabad : ఐఐటీ హైదరాబాద్‌లో కరోనా కలకలం.. 119 మంది విద్యార్థులకు పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.