రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని దశలవారీగా ప్రైవేట్‌పరం చేయడానికి ప్రయత్నిస్తోందని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఆరోపించింది. ఆర్టీసీ ప్రొడక్షన్ యూనిట్లను పటిష్ఠం చేసి, మ్యాన్ అవర్ రేట్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్ భవన్ ముందు ధర్నా నిర్వహించారు. కార్మికులపై అదనపు పనిభారం మోపడమే కాకుండా, వారికి చెల్లించాల్సిన ఇన్సెంటివ్స్ను సకాలంలో ఇవ్వడం లేదంటూ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజ్‌రెడ్డి ఆరోపించారు.
ఇదీ చూడండి: ఈనెల 25న ఆర్టీసీ డిపోల ముందు నిరసన