ETV Bharat / state

55 అత్యవసర ఔషధాలపై కేంద్రం ఆరా.. - Telangana government has sent a report to the Center

అత్యవసర ఔషధాలపై కేంద్రం రాష్ట్రాలనూ సమాచారం కోరింది. దీనితో తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ నిల్వలపై కేంద్రానికి ఓ నివేదిక పంపింది.

the-telangana-government-has-sent-a-report-to-the-center-on-drug-stocks
55 అత్యవసర ఔషధాలపై కేంద్రం ఆరా.. నివేదిక పంపిన ప్రభుత్వం
author img

By

Published : May 19, 2020, 10:38 AM IST

కరోనా బాధితుల్లో అత్యవసర వైద్యసేవలు (ఐసీయూ) పొందేవారు సుమారు 5 శాతం వరకూ ఉంటారు. వీరిలో చాలా మంది అధిక రక్తపోటు, మధుమేహం, గుండె, మూత్రపిండాలు, శ్వాసకోశ తదితర దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారూ ఉన్నారు. ఇలాంటి వారి కోసం సుమారు 55 రకాల ఔషధాలు అవసరమవుతాయని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఆ మందుల నిల్వలు అందుబాటులో ఉన్నాయా అని అన్ని రాష్ట్రాలనూ సమాచారం కోరింది. దీనితో తెలంగాణ ప్రభుత్వం ఇక్కడి నిల్వలపై సోమవారం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించింది.

పెరిగిన ఉత్పత్తి

ఔషధాల తయారీ పునఃప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపడంతో, మూడు వారాల్లోనే ఉత్పత్తి దాదాపు 23 శాతం పెరిగింది. రాష్ట్రంలోని 432 ఔషధ కంపెనీల్లో ప్రస్తుతం 401 సంస్థలు పనిచేస్తున్నాయి. వీటిలో సగటున 53.15 శాతం ఉద్యోగులు సేవలందిస్తున్నారు. కరోనా కేసులు ప్రారంభమైన తొలి రోజుల్లో 29 శాతమున్న ఔషధ ఉత్పత్తుల సగటు సోమవారం నాటికి 52.42 శాతానికి పెరిగింది. కొన్ని సంస్థల్లో 70-80 శాతం ఉత్పత్తి జరుగుతోందని, మానవ వనరుల కొరత ప్రభావం ఉత్పత్తిపై పడుతోందని ఔషధ నియంత్రణ సంస్థ నివేదికలో వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం సూచించిన 55 రకాల ఔషధాల నిల్వలు ప్రస్తుతం దేశీయ అవసరాలకు సరిపోగా, విదేశాలకూ సరఫరా చేసే స్థితిలో ఉన్నట్లు పేర్కొంది.

‘రాష్ట్రంలో కరోనా బాధితులకు ఐసీయూల్లో అందించే ఔషధాలకు ఎటువంటి లోటూ లేదు. కొవిడ్‌-19కు ముందు రాష్ట్రంలో 5 కంపెనీలు మాత్రమే శానిటైజర్లను ఉత్పత్తి చేసేవి. ఆల్కహాల్‌/ఇథనాల్‌ ఆధారిత శానిటైజర్ల ఉత్పత్తికి ప్రభుత్వం 120 సంస్థలకు అనుమతించడంతో వాటి కొరత తీరింది’’ అని ఔషధ నియంత్రణ సంస్థ సంయుక్త సంచాలకులు డాక్టర్‌ బి.వెంకటేశ్వర్లు అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.