అసెంబ్లీ సమావేశాల పనిదినాల విషయమై సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన బీఏసీ నిర్వహించారు. ఈనెల 28 వరకు 18 పనిదినాలు సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. ఈనెల 12, 13, 20, 27 తేదీల్లో రెండో శనివారం, ఆదివారం శాసనసభకు సెలవు ఉంటుంది. గంటపాటు ప్రశ్నోత్తర సమయానికి కేటాయించారు. అయితే ప్రశ్నోత్తరాల సమయంలో ఆరు ప్రశ్నలకే అనుమతి ఇవ్వాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. అరగంట పాటు జీరో అవర్ ఉంటుంది.
ఈనెల 28న బీఏసీ మరోసారి సమావేశం కానుంది. మంగళవారం పీవీ శత జయంతి ఉత్సవాలపై చర్చ, తీర్మానాలు చేయనున్నారు. ఈనెల 9న కరోనాపై చర్చ జరగనుంది. అదే రోజు రెవెన్యూ బిల్లును సభలో ప్రవేశ పెట్టనున్నారు. ఈనెల 10, 11న కొత్త రెవెన్యూ బిల్లు చట్టంపై చర్చించనున్నారు. బిల్లుల ఆమోదం కోసం సాయంత్రం సమావేశాలను నిర్వహించనున్నారు.