రాష్ట్రంలో గత రెండు రోజులుగా తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఈరోజు దక్షిణ కోస్తాంధ్ర పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 29 శాతం అధికంగా వర్షపాతం నమోదైందన్నారు.
ఇవాళ వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన వివరించారు.
ఇదీ చూడండి : రాష్ట్ర అధికారులతో కేంద్ర బృందం సమావేశం