దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పిటిషన్‌ను విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఇప్పటికే కమిషన్ వేశామని వెల్లడించింది. తెలంగాణ హైకోర్టుకు వెళ్లేందుకు అనుమతించాలని పిటిషనర్ కోరగా... ధర్మాసనం అనుమతినిచ్చింది. కేసుకు సంబంధించి అన్ని ఆధారాలు సేకరించి భద్రపరచాలని పిటిషనర్ న్యాయస్థానాన్ని కోరారు. ఆధారాల సేకరణపై తెలంగాణ హైకోర్టు సరైన ఆదేశాలు ఇస్తోందని సుప్రీంకోర్టు తెలిపింది. సామాజిక కార్యకర్త సజయ సహా పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
ఇవీ చూడండి: యాదాద్రీశుని సన్నిధిలో సీఎం కేసీఆర్