ETV Bharat / state

DA hike Orders: ఉద్యోగులకు శుభవార్త.. డీఏ ఉత్తర్వులు జారీ - డీఏ పెంపు ఉత్తర్వులు

DA hike Orders: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కరవు భత్యం (డీఏ) పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల మంత్రివర్గం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన డీఏ 2021 జూలై ఒకటి నుంచి వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

DA hike Orders
డీఏ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
author img

By

Published : Jan 20, 2022, 5:28 AM IST

DA hike Orders: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, పింఛనుదారులకు పెండింగులో ఉన్న 3 డీఏలు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడింటికి కలిపి 10.01 శాతం చెల్లింపులకు నిన్న రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. మంత్రివర్గంలో నిర్ణయం మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

2021 జులై 1 నుంచి అమలు

DA For employees: పెరిగిన డీఏ 2021 జులై 1 నుంచి వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈనెల నుంచి వేతనంతో పాటు పెరిగిన డీఏ ఉద్యోగులకు అందనుంది. 2021 జులై నుంచి బకాయిలు జీపీఎఫ్‌లో ప్రభుత్వం జమ చేయనుంది. కరోనా కారణంగా రెండేళ్లుగా డీఏల చెల్లింపులో జాప్యం ఏర్పడింది. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడడంతో మూడు డీఏలను ఒకేసారి చెల్లించేందుకు మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. సీపీఎస్ వర్తించే ఉద్యోగులకు బకాయిల్లో పది శాతాన్ని ప్రాన్ ఖాతాకు జమచేస్తారు. మిగతా 90 శాతాన్ని జూన్ నుంచి మూడు విడతల్లో చెల్లిస్తారు. విశ్రాంత ఉద్యోగులకు కూడా పెరిగిన డీఏ ఫిబ్రవరిలో అందుతుంది. బకాయిలను మే నుంచి ఆరు విడతల్లో చెల్లిస్తారు. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.