హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను మంత్రులు ప్రారంభించారు. ఎగ్జిబిషన్ నిర్వహణ ద్వారా వచ్చిన ఆదాయంతో విద్యా వ్యాప్తికి కృషి చేస్తామని మంత్రి ఈటల అన్నారు. మహిళా పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్ నుమాయిష్ ఔన్నత్యాన్ని మరింత పెంచేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దేశమే హైదరాబాద్ వైపు చూసే విధంగా నుమాయిష్‌ను తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: బస్సులెక్కాలంటే ఆలోచించాల్సిందే..