రైల్వే లెవల్ క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాల నివారణకు ప్రత్యేక భద్రతా, సరుకు రవాణా, మౌలిక సదుపాయల పనులు, ప్రస్తుత కొవిడ్ పరిస్థితి, వైద్య వసతుల ఏర్పాటు తదితర అంశాలపై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మల్య దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. రైల్వేలో అనుకోని ప్రమాదాలకు ప్రధాన కారణమయ్యే వీటిపై దృష్టి పెట్టాలని తెలిపారు.
క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించే సిబ్బంది భద్రతపై సమీక్షిస్తూ... వారికి కావాల్సిన సహాయ సహకారాలు కల్పించాలని తెలిపారు. రాబోయే వర్షాకాలం దృష్ట్యా ముందు జాగ్రత్తగా ట్రాక్‌పై పెట్రోలింగ్ నిర్వహిస్తూ భద్రత పటిష్టతకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రైతులకు, వ్యాపారస్తులకు ప్రయోజనం కలిగేలా మరిన్ని కిసాన్ రైళ్లను నడిపే అంశంపై ఆయన చర్చించారు. ఈ సమావేశంలో విజయవాడ, గుంతకల్, గుంటూరు, సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్ల అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: CCMB: కరోనా రాకుండా మాస్కు ఎలా ధరించాలో తెలుసా!