ప్రయాణీకుల రద్దీ తక్కువగా ఉండడంతో 6 ప్రత్యేక రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రకటించింది.
తాత్కాలిక రైళ్ల రద్దు వివరాలు...
- విశాఖపట్నం-కాచిగూడ రైలును జూలై 1 నుంచి 14 వరకు
- కాచిగూడ-విశాఖపట్నం రైలును జూలై 2 నుంచి 15 వరకు
- విశాఖపట్నం-కడప రైలును జూలై 1 నుంచి 14 వరకు
- కడప-విశాఖపట్నం రైలును జూలై 2 నుంచి 15వరకు
- విశాఖపట్నం-లింగంపల్లి రైలును జూలై 1 నుంచి 14వరకు
- లింగంపల్లి-విశాఖపట్నం రైలును జూలై 2 నుంచి 15 వరకు రద్దు చేస్తున్నట్లు ద.మ.రైల్వే వెల్లడించింది.
మరోవైపు, ప్రయాణికుల సౌకర్యార్థం వివిధ మార్గాల్లో నాలుగు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
ప్రత్యేక రైళ్ల వివరాలు..
- సికింద్రాబాద్-అగర్తల రైలు జూలై 5, 12న, అగర్తల-సికింద్రాబాద్ రైలు జూలై 9, 16న బయల్దేరుతుంది.
- అగర్తల-బెంగళూరు కంటోన్మెంట్ రైలు జూలై 6 నుంచి 24 వరకు ప్రతి మంగళవారం నడుస్తుంది.
- అలాగే, బెంగళూరు కంటోన్మెంట్-అగర్తల రైలు జూలై 9 నుంచి 27 వరకు ప్రతి శుక్రవారం బయల్దేరుతుందని దక్షిణ మధ్య రైల్వే శాఖ పేర్కొంది.
ఇదీ చూడండి: వైఎస్ షర్మిల ఇంటిముందు అమరావతి పరిరక్షణ సమితి ధర్నా