ETV Bharat / state

తెగబడుతున్న కుక్కలు... వణికిపోతున్న ప్రజలు - హైదరాబాద్‌లో వీధి కుక్కల సమస్య తీవ్రం

భాగ్యనగరంలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. వీటి సమస్య తీవ్రంగా ఉండడంతో ప్రజలను భయబ్రాంతులకు లోనవుతున్నారు. బహదూర్‌పుర, రామంతాపూర్‌ ప్రాంతాల్లో వారం రోజుల వ్యవధిలో ఇద్దరు చిన్నారులను వీధి కుక్కలు బలి తీసుకున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చును. ఏళ్లు గడుస్తున్నా నియంత్రణ సాధ్యపడకపోవడం స్థానిక కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శునకాలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల పేరుతో ఏటా రూ.10 కోట్ల నిధులు ఖర్చు చేస్తుండటంపై విమర్శలొస్తున్నాయి.

The problem of street dogs in Hyderabad is serious.
తెగబడుతున్న కుక్కలు... వణికిపోతున్న ప్రజలు
author img

By

Published : Feb 5, 2021, 7:03 AM IST

హైదరాబాద్‌లో వీధి కుక్కల సమస్య తీవ్రంగా ఉంది. కంటపడితే చాలు కరుస్తున్నాయి. బహదూర్‌పుర, రామంతాపూర్‌ ప్రాంతాల్లో వారం రోజుల వ్యవధిలో ఇద్దరు చిన్నారులను వీధి కుక్కలు బలి తీసుకున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్ఛు ఏళ్లు గడుస్తున్నా నియంత్రణ సాధ్యపడకపోవడం.. ఆ పేరుతో ఏటా రూ.10 కోట్ల నిధులు ఖర్చు చేస్తుండటంపై విమర్శలొస్తున్నాయి.

లెక్కల మాయాజాలం

బల్దియా పశువైద్య విభాగం లెక్కల ప్రకారం.. రోజుకు 250-300 శునకాలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు(ఏబీసీ) చేస్తారు. ఏడాదికి కనీసం లక్ష, అయిదేళ్లలో 5 లక్షల శునకాలకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు జరిగాయి. అంటే చాలా ప్రాంతాల్లో వీధి కుక్కలు కనిపించకూడదు. వాటి సంఖ్య మాత్రం నగరంలో పెరుగుతోంది. వీధుల్లో గతంలో రెండు, మూడు సంచరిస్తుంటే..ప్రస్తుతం 20 నుంచి 30 తిరుగుతున్నాయి. రాత్రి వేళ అడుగుపెట్టలేని పరిస్థితి. జీహెచ్‌ఎంసీ ఆపరేషన్ల పేరుతో ప్రైవేటు వైద్యులకు ఒక్కో శునకానికి రూ.1,500 చెల్లించేది. విమర్శలు రావడంతో ఇటీవల స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రక్రియ నిర్వహిస్తోంది. గతంలో అనుభవం లేని వైద్యుల వల్ల శస్త్రచికిత్సలు విఫలమవడం లేదా? శునకం చనిపోవడం జరిగేది. ఏబీసీ ప్రక్రియ నిధుల మేతగా మారిందన్న విమర్శలొచ్చాయి.. జీహెచ్‌ఎంసీ విజిలెన్స్‌ విభాగం తనిఖీల్లోనూ రేబిస్‌ టీకాలకు సంబంధించి లోపాలు వెలుగు చూశాయి. ఆపరేషన్లు నిర్వహించే కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినా..ఆ పని జరగలేదు.

The problem of street dogs in Hyderabad is serious.
బల్దియా పశువైద్య నివేదిక ప్రకారం

లాక్‌డౌన్‌లోనూ..

గతేడాది మార్చి 23 నుంచి మే 15 వరకు లాక్‌డౌన్‌ అమలులో ఉంది. ఆ సమయంలోనూ వీధి కుక్కలు జనాలపై దాడులు చేశాయి. ఫీవర్‌ ఆసుపత్రిలో నమోదైన కేసుల వివరాలు పరిశీలిస్తే.. 2020 జనవరిలో 2405, ఫిబ్రవరిలో 2161, మార్చిలో 1755, ఏప్రిల్‌లో 282, మేలో 0, జూన్‌లో 1143, జులైలో 738, ఆగస్టులో 969, సెప్టెంబరులో 1044, అక్టోబరులో 1278, నవంబరులో 1553 మంది కుక్కకాటుకు గురయ్యారు. ప్రైవేటు ఆస్పత్రులను సంప్రదించిన వారిని లెక్కిస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

వీటిపై దృష్టి పెట్టాలి..

* సమస్యాత్మక ప్రాంతాలలో ఉన్న కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలి. అలా ఒక్కో ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుంటే వాటి జనాభా నియంత్రణ సాధ్యమవుతుంది.

* రేబిస్‌ సోకి, పిచ్చిగా ప్రవర్తించేవాటిని గుర్తించే హాట్‌లైన్‌ వ్యవస్థను జీహెచ్‌ఎంసీ సమకూర్చుకోవాలి. ఇది లేక 2020లో అమీర్‌పేటలో రెండు కుక్కలు 50 మందిని గాయపర్చాయి. అనంతరం జరిపిన పరీక్షల్లో దాడిచేసిన శునకానికి రేబిస్‌ ఉన్నట్లు తేలింది.

* ఏబీసీ శస్త్రచికిత్సలకు అనుభవజ్ఞులైన వైద్యులను సమకూర్చుకోవాలి.

చిన్నారిపై శునకాల దాడి

ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్‌లోని చాకలిబస్తీలో ఉండే వై.కుమార్‌ కుమార్తె సహస్ర(6) బుధవారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటుంది. ఈ క్రమంలో వీధి శునకాల గుంపు చిన్నారిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. స్థానికులు చెదరగొట్టి చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. వెంటనే చికిత్సకు ఆస్పత్రికి తరలించారు. మున్సిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని భరత్‌నగర్‌కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు.

గాయపడ్డ సహస్ర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.