Naveen murder case update: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో జరిగిన నవీన్ హత్య కేసులో నిందితుడు హరిహరకృష్ణను పోలీసులు రెండో రోజు విచారిస్తున్నారు. చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న హరిహరను న్యాయస్థానం అనుమతితో అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు నిన్న కస్టడీలోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం సరూర్‌నగర్‌లోని ఎస్ఓటీ కార్యాలయానికి తీసుకెళ్లి తొలిరోజు ప్రశ్నించారు.
ఈనెల 9 వరకు నిందితుడిని కస్టడీకి కోర్టు అనుమతించగా రెండో రోజు విచారణ కోసం ఇవాళ ఉదయం ఎస్ఓటీ కార్యాలయానికి తీసుకువచ్చారు. నవీన్‌ని హత్య చేయడానికి కేవలం ప్రేమ వ్యవహారమే కారణమా లేకపోతే ఇంకేమైనా గొడవలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్య చేసిన తర్వాత చాలాసేపు సంఘటనా స్థలంలోనే ఉన్న హరిహరకృష్ణ అనంతరం ఆధారాలు చెరిపివేశాడు.
నిందితుడు హరిహరకృష్ణ.. నవీన్ చరవాణిని ధ్వంసం చేసి, బాహ్యవలయ రహదారి పక్కన ఉన్న చెట్లపొదల్లో పడేశాడు. అనంతరం బైక్‌పై చాలా ప్రదేశాలు హరిహర తిరిగినట్లు తెలుస్తోంది. ఆ కేసులో కీలక సమాచారం దాగి ఉన్న నవీన్ చరవాణిని రికవరీ చేయడంతో పాటు, హరిహరను తీసుకెళ్లి పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఇవాళ ఉదయం 3గంటలు సమయంలో ఘటన స్థాలానికి పోలీసులు హరిహరను తీసుకెళ్లి హత్య జరిగిన తీరును తెలుసుకున్నారు.
యువతి పాత్రపై అనుమానాలు: నవీన్ హత్య కేసులో హరిహర కృష్ణతో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో నిందితుడు స్నేహితురాలుపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆమెకు మూడుసార్లు ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చి విచారించగా స్పష్టమైన సమాధానాలు రాబట్టలేకపోయారని తెలుస్తోంది. సఖి సెంటర్ కౌన్సిలింగ్ ఇప్పించినా ఆమెలో ఎటువంటి మార్పు రాకపోవడం గమన్హారం. యువతి తల్లిదండ్రులు పెద కుటుంబానికి చెందిన వారు కావడంతో వారు పోలీసుల ఎదుట కంటతడిపెడుతున్నారు.
మరోవైపు పోలీసులు ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చెపట్టి.. నిందితుడి పోలీసు కస్టడీ ముగిసిన అనంతరం సరైనా ఆధారాలతో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నవీన్ హత్యకేసు విచారణ ముగిసేలా చర్యలు చేపట్టాలని పోలీసులు భావిస్తున్నారు.
యువతలో ఎందుకు ఈ ఆవేశం: గత వారం, పది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వరుస హత్యలు, వేధింపుల వార్తలతో జనం విసిగిపోతున్నారు. మొన్న సీనియర్ వేధింపులతో ప్రీతి ఆత్మహత్య కేసు, పెళ్లికి నిరాకరించిందని బెంగుళూరులో తెలుగు యువతి దారుణ హత్య, నిన్న నిజామాబాద్‌లో అబ్ధల్లాపూర్మెట్ తరహాలోనే మరో హత్య కేసు ఎందుకు ఇలా.. సాంకేంతికను ఉపయోగించుకొని రాకెట్లతో పాటు యువత దూసుకుపోతుంటే.. మంచి విద్యాలయాల్లో సీట్లు సంపాదించి ఆరు అంకెల జీతంతో తల్లిదండ్రుల కలలను సాకారం చేస్తుంటే.. కొద్ది మంది యువత మాత్రం ప్రేమ, అహంకారం, వేధింపులతో క్రైమ్ సీన్లకు తెగపడుతూ వారిపై చెరగని ముద్ర వేసుకుంటున్నారు. వారి బంగారు కళల జీవితాన్ని కటకటాలపాలు చేసుకుంటున్నారు.
ఇవీ చదవండి:
'అబ్దుల్లాపూర్‌మెట్ హత్య' కేసులో వెలుగులోకి ఆశ్చర్యపోయే విషయాలు
హత్య చేసి టూర్లు.. వారం తర్వాత శరీరభాగాల దహనం.. నవీన్ కేసులో విస్తుపోయే అంశాలు