cybercrime Toll free number 1930: సైబర్ నేరాల ఫిర్యాదులు స్వీకరించేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అందుబాటులోకి తెచ్చిన టోల్‌ఫ్రీ నంబరు 155260 మారింది. ఇకపై ‘1930’ టోల్‌ఫ్రీ నంబరుగా కొనసాగనుంది. ఇప్పటివరకూ పనిచేస్తున్న నంబరును డయల్ చేసేందుకు అసౌకర్యంగా ఉందంటూ వేలమంది బాధితులు వివరించడంతో కేంద్ర హోంమంత్రిత్వశాఖ అధికారులు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీస్ విభాగాలు, ఐటీ నిపుణులతో చర్చించి ‘1930’ను ఖరారు చేశారు. రెండు, మూడురోజుల నుంచి సామాజిక మాధ్యమాల్లో ఈ నంబరును ప్రచారం చేస్తున్నారు. కొందరు బాధితులు సోమవారం 155260 నంబరుకు ఫిర్యాదు చేయగా కొత్త నంబరుకు చేయాలని సూచించారు.
అలర్ట్.. సైబర్ క్రైం టోల్‌ఫ్రీం నంబర్ మారింది
cybercrime Toll free number 1930: సైబర్ నేరాల ఫిర్యాదులు స్వీకరించేందుకు కేంద్రహోంమంత్రిత్వ శాఖ అందుబాటులోకి తెచ్చిన టోల్‌ఫ్రీ నంబర్ మారింది. 155260గా ఉన్న నంబరు ఇకపై 1930గా కొనసాగనుంది.