ETV Bharat / state

Maoist Leader RK Death Confirm: ఆర్కే మృతిపై మావోయిస్టు పార్టీ క్లారిటీ.. ఎప్పుడు చనిపోయారంటే - maoist rk died

Maoist Leader RK
Maoist Leader RK
author img

By

Published : Oct 15, 2021, 12:58 PM IST

Updated : Oct 15, 2021, 4:19 PM IST

12:56 October 15

ఆర్కే మృతిని ధ్రువీకరించిన మావోయిస్టు పార్టీ

Maoist Leader RK Death Confirm
మావోయిస్టు పార్టీ ప్రకటన

మావోయిస్టు పార్టీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్కే మృతిని ఆ పార్టీ కేంద్ర నాయకత్వం ధ్రువీకరించింది. ఆయన మృతి చెందినట్టు పార్టీ కేంద్ర కమిటీ శుక్రవారం మధ్యాహ్నం ప్రకటించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికారిక ప్రతినిధి అభయ్‌ పేరుతో ఓ ప్రకటన విడుదలైంది. నిన్న ఉదయం 6గంటలకు ఆర్కే కన్నుమూసినట్టు ప్రకటనలో వెల్లడించారు. విప్లవ శ్రేణుల మధ్య అంత్యక్రియలు జరిపినట్లు స్పష్టం చేశారు.  కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆర్కే.. డయాలసిస్‌ జరుగుతుండగా మృతిచెందారని పేర్కొన్నారు.

 ఆర్కే మృతి పార్టీకి తీరని లోటు.. 1978లో ఆర్కే పీపుల్స్‌ వార్‌ సభ్యత్వం తీసుకున్నారు. 1982 నుంచి పూర్తికాలం కార్యకర్తగా వచ్చారు. 1986లో గుంటూరు జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. 1992లో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా.. 2000లో ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శిగా.. 2001లో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2004 నుంచి పదేళ్లు ఏవోబీ కార్యదర్శిగా కొనసాగారు. అలాగే, 2018లో కేంద్ర కమిటీ పొలిట్‌బ్యూరోలో ఆర్కేకు స్థానం లభించింది అని పేర్కొన్నారు.  

  • ప్రభుత్వ హత్యగానే భావిస్తాం

ఆర్కే మృతిపై పార్టీ ప్రకటన తర్వాత ఆయన భార్య శిరీష బోరున విలపించారు. 

ఆర్కే మృతిని ప్రభుత్వ హత్యగానే భావిస్తాం. ఆర్కే నిరంతరం ప్రజల కోసం పరితపించారు. మావోయిస్టులకు పోలీసులు వైద్యం అందనివ్వడం లేదు - ఆర్కే భార్య శిరీష.

  • ఆశయ సాధనను కొనసాగిస్తాం

ఆర్కే మృతి చెందినట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించిన తర్వాత విరసం నేత కల్యాణరావు కన్నీటి పర్యంతమయ్యారు.  

ఆర్కే ప్రజల హృదయాల్లో ఉంటారు. ఆర్కే ప్రజలకోసం అమరుడయ్యారు. ఆర్కేకు వైద్యం అందకుండా చేశారు. వైద్యం అందకుండా పోలీసులను మోహరించారు. ఆర్కే విప్లవకారుడిగా జీవించాడు.. విప్లవకారుడిగానే మరణించారు.  ఆర్కే ఆశయ సాధనను కొనసాగిస్తాం -  విరసం నేత కల్యాణరావు.

విరసం నేత పినాకపాణి

మావోయిస్టుల అణచివేతకు కేంద్రం లక్షల కోట్లు వెచ్చిస్తోంది. ఆపరేషన్ సమాధాన్ పేరుతో మవోయిస్టులను అణచివేస్తోంది. మావోలకు వైద్యం అందకుండా ఆపరేషన్ సమాధాన్ చేపట్టారు -  విరసం నేత పినాకపాణి.

ఇదీ చూడండి: Senior Maoist Leader RK: 'చదివే రోజుల్లోనే సామాజిక సమస్యలపై నిరసన గళం'

Last Updated : Oct 15, 2021, 4:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.