పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌తో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ ధర్నాచౌక్ వద్ద మహాధర్నా నిర్వహించారు. బీసీలకు అన్ని రంగాల్లో వాటా కల్పించాలని బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రెండు లక్షల 81వేల కోట్లు అప్పు చేశారని... వాటిని బీసీలు కూడా కడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుల్లో వాటా ఉంది కానీ... ఆస్తుల్లో వాటా లేదని ఎద్దేవా చేశారు. బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తన పార్టీ ముందుంటుందని ఉంటుందని తెజస అధ్యక్షుడు కోదండరాం హామీ ఇచ్చారు.
ఇవీచూడండి: నియోజకవర్గ అభివృద్ధి నిధులకు బ్రేక్?