ETV Bharat / state

స్వస్థలానికి రాకేశ్ మృతదేహం.. గాయపడ్డ వారికి గాంధీలో కొనసాగుతున్న చికిత్స - గాంధీ ఆసుపత్రి తాజా వార్తలు

damera rakesh update: సికింద్రాబాద్​ స్టేషన్ ఘటనలో గాయపడ్డ వారు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 14మందికి అక్కడ చికిత్స అందిస్తున్నామని గాంధీ వైద్యులు తెలిపారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ దామెర రాకేశ్​ను రక్షించేందుకు తీవ్రంగా శ్రమించిన ఫలితం లేకపోయిందని తెలిపారు. మిగతావారి ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. మరోవైపు ముందుజాగ్రత్త చర్యగా పోలీసులు ఆసుపత్రి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

గాంధీ ఆసుపత్రి
గాంధీ ఆసుపత్రి
author img

By

Published : Jun 17, 2022, 7:35 PM IST

Updated : Jun 17, 2022, 10:30 PM IST

damera rakesh update: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​లో జరిగిన దాడి ఘటనలో గాయపడ్డ దామెర రాకేశ్ మృతదేహాన్ని అధికారులు వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఉదయం కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ రాకేశ్​ను హుటాహుటిన గాంధీకి తరలించారు. బాధితుడిని ఆస్పత్రికి తీసుకువచ్చేప్పటికీ పల్స్ లేదని.. దాదాపు 45 నిమిషాల పాటు సీపీఆర్ చేసినా ఉపయోగం లేకపోయిందని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు స్పష్టం చేశారు.

మృతుడు రాకేశ్
మృతుడు రాకేశ్

మధ్యాహ్నం శవపరీక్ష అనంతరం.. సాయంత్రం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. రాకేశ్ మృతదేహాన్ని అతని స్వగ్రామం వరంగల్ జిల్లా దబీర్​పేటకు తరలించారు. ఆసుపత్రి వద్ద ఆందోళన జరగకుండా అందరి దృష్టి మరల్చి పోలీసులు మృతదేహాన్ని అంబులెన్స్​లో తరలించారు. గ్రామీణ ప్రాంతంలో పుట్టినప్పటికీ... ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలన్నది రాకేష్ చిరకాల స్వప్నం అని బాల్య మిత్రుడు అరుణ్ అన్నాడు. తన మిత్రుడి తల్లిదండ్రులు వృద్ధులు అని.. సోదరి స్ఫూర్తితో బాపట్లలో ఉచిత శిక్షణ తీసుకుని రెండు పరీక్షల్లో కూడా ఉత్తీర్ణుడై మూడో పరీక్షకు సిద్ధమవుతూ ఎదుర్కొని సైన్యంలో చేరాలని అనుకున్నాడని వాపోయాడు.

మరోవైపు ఇవాళ్టి ఘర్షణలో గాయపడ్డ సుమారు 14మందికి గాంధీ ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. ఫైరింగ్​లో బుల్లెట్ తగిలి ఛాతీలో గాయమైన మరో వ్యక్తికి వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం పరిస్థితి ఆందోళన కరంగా ఉందని తెలిపారు. ఇక కాలికి గాయం అయిన మరో బాధితుడికి వైద్యులు శస్త్రచికిత్స చేశారు. మరో 11 మంది ఆరోగ్యం నిలకడగా ఉందని వివరించారు. అయితే బాధితుల శరీరంపై బుల్లెట్ గాయాలాంటి ఆనవాళ్లు ఉన్నట్టు రాజారావు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాతే నిర్ధారించగలమని వివరించారు.

బాధితులకు గాంధీలో చికిత్స అందిస్తున్న నేపథ్యంలో ఆసుపత్రి వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. పోలీసు బలగాలను భారీగా మోహరించారు. శాంతి భద్రతల విభాగం పోలీసులతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను కూడా అక్కడ మోహరించారు. ఉత్తరమండలం డీసీపీ చందనాదీప్తి గాంధీ ఆసుపత్రి వద్ద భద్రతను సమీక్షించారు. ఆందోళనకారులు ఆసుపత్రికి రావచ్చన్న సూచనలతో పోలీసులు పూర్తి స్థాయిలో అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఆసుపత్రి సిబ్బంది, పాసులున్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఆసుపత్రి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన రాజకీయ పార్టీల నేతలను పోలీసులు అనుమతించలేదు.

ఇదీ చదవండి: damera rakesh: సైన్యంలో చేరాలనుకున్నాడు.. నెరవేరకుండానే చనిపోయాడు

ఏమిటీ 'అగ్నిపథ్​'? వారి నుంచి ఎందుకింత వ్యతిరేకత?

Last Updated : Jun 17, 2022, 10:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.