ETV Bharat / state

చిదిమిపోయిన చిరు వ్యాపారుల బతుకులు! - The impact of corona on petty traders life

కరోనా వల్ల విధించిన లాక్​డౌన్​ వల్ల ఎందరో వ్యాపారుల బతుకుబండి ముందుకు సాగక.. వారి జీవితాలు దుర్భరంగా సాగుతున్నాయి. భాగ్యనగరంలో చిరువ్యాపారాలు చేసుకునే 5 లక్షల మంది ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. దాదాపు రెండు నెలలుగా దమ్మిడి సంపాదన లేక పూటగడవడం కష్టంగా మారింది.

the-impact-of-corona-on-petty-traders-life
చిదిమిపోయిన చిరు వ్యాపారుల బతుకులు!
author img

By

Published : May 18, 2020, 9:40 AM IST

ఎండనక..వాననక..పగలనక..రాత్రనక...వీధుల్లో పడిగాపులు కాసి వ్యాపారం చేసుకునే చిరువ్యాపారుల జీవితాలు దుర్భరంగా మారాయి. కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ కారణంగా వ్యాపారాలు ముందుకు సాగక.. తీసుకువచ్చిన పండ్లు, కూరగాయలు వంటివి అమ్ముడుపోక నష్టాలను మూటగట్టుకోవాల్సి వస్తోంది. నగరంలో దాదాపు 5 లక్షల మంది వ్యాపారులు వీధుల్లోనే వ్యాపారాలు చేసుకునే వారు. రోజువారీ సంపాదనతో బతికే జీవితాలు ఇప్పుడు కన్నీటిసంద్రాన్ని ఈదుతున్నాయి. దాదాపు రెండు నెలలుగా దమ్మిడి సంపాదన లేక పూటగడవడం కష్టంగా మారింది. ఆదివారం ఓ చిరువ్యాపారి రెండు నెలలుగా సంపాదన లేక కుటుంబాన్ని సాకలేకపోతున్నానని ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది.

35ఏళ్లుగా పూల వ్యాపారంతోనే కుటుంబాన్ని పోషిస్తున్నా. ఇన్నేళ్లలో ఎప్పుడూ పడని ఇబ్బంది.. ఇప్పుడొచ్చి పడింది. గుళ్లు లేవు.. పెళ్లిళ్లూ లేవు.. పూలు అమ్ముడుపోవడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మినా రూ.500 రావడం కనాకష్టంగా ఉంది. పూలు పారేయాల్సి వస్తోంది. వేరే వ్యాపారం చేద్దామంటే వయసు సహకరించక అలాగే నెట్టుకొస్తున్నా

- అక్కిరెడ్డి, పూలవ్యాపారి, కేపీహెచ్‌బీ ఆరోఫేజ్‌.

ఓ ఐటీ కంపెనీలో కారు డ్రైవర్‌గా పనిచేసేటోణ్ని. నెలకు రూ.30 వేల వరకు వచ్చేది. లాక్‌డౌన్‌తో కంపెనీ మూతపడింది. ఉద్యోగులంతా ఇంటి నుంచే పనిచేస్తున్నారు. నా భార్య బ్యాంకులో పొరుగు సేవల విభాగంలో పనిచేస్తోంది. ఆమెకొచ్చే సంపాదనతో ఇల్లు గడవడం కష్టంగా ఉంది. చేసేదిలేక మాస్కులు, శానిటైజర్లు అమ్ముకుంటున్నా. ఆదాయం ఖర్చులకే సరిపోతోంది.

- జాఫర్‌, ఎర్రగడ్డ ఏజీ కాలనీ వద్ద చిరు వ్యాపారి.

కుటుంబమంతా షాపూర్‌నగర్‌ మార్కెట్‌లో కూరగాయలు విక్రయించేవాళ్లం. మార్కెట్‌ మూతపడింది. అద్దె తోపుడు బండితో వీధుల్లో తిరిగి కూరగాయలు అమ్ముకుంటున్నాం. బోయిన్‌పల్లికి వెళ్లి కూరగాయలు తెచ్చుకుంటున్నాం. సరిగా అమ్ముడుపోక పాడవుతున్నాయి. అరకొర సంపాదనతోనే లాక్కొస్తున్నాం. కష్టం ఎక్కువ.. రాబడి తక్కువ. ఎప్పుడు ఈ కరోనా బాధ తొలుగుతుందాని ఎదురుచూస్తున్నాం.

- తాతాజీ, కూరగాయల వ్యాపారి, షాపూర్‌నగర్‌.

20 ఏళ్లుగా కేపీహెచ్‌బీ జేఎన్‌టీయూ రోడ్డులోనే పండ్లు అమ్ముతున్నా. లాక్‌డౌన్‌లో ప్రజల ఆదాయం తగ్గిపోయింది. రాకపోకలు తగ్గాయి. పండ్లు అమ్ముడుపోవడం లేదు. గతంలో ఈ సీజన్‌లో రోజుకు రూ.5 వేల వరకు అమ్మేవాణ్ని. ఇప్పుడు రూ.వెయ్యి పండ్లు అమ్మడం కష్టంగా మారింది. నిల్వ ఉంచితే ఎండలకు పాడైపోతున్నాయి. కుటుంబ పోషణ కష్టంగా మారింది.

- ఖాజా, పండ్ల వ్యాపారి, హఫీజ్‌పేట.

ఇదీ చదవండి: వలస కూలీలను ఫోన్​ నంబర్​తో పట్టేస్తారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.