ETV Bharat / state

నేడు.. రేపు రాష్ట్రంలో పలుచోట్ల వడగళ్ల వాన - Hyderabad Meteorological Department news

రాష్ట్రంలో రెండు రోజులపాటు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర కర్ణాటక పరిసర ప్రాంతాల నుంచి దక్షిణ కేరళ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిన కారణంగా శుక్ర, శని వారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కువరవచ్చునని పేర్కొంది.

Chance of rain in the state today and tomorrow
రాష్ట్రంలో వర్షం కురిసే అవకాశం
author img

By

Published : May 7, 2021, 9:58 AM IST

రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో పలు చోట్ల ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆదివారం కూడా వర్షాలు పడవచ్చని వెల్లడించింది. ఉత్తర కర్ణాటక పరిసర ప్రాంతాల నుంచి దక్షిణ కేరళ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తున ఏర్పడిన ఉపరితల ద్రోణి స్థిరంగా కొనసాగుతున్నట్లు తెలిపింది.

గురువారం ఉదయం 8 నుంచి సాయంత్రం 7 గంటల వరకు పలు ప్రాంతాల్లో ఒక మాదిరి వర్షాలు కురిశాయి. అత్యధికంగా మోమిన్‌పేట్‌(వికారాబాద్‌ జిల్లా)లో 3.1, బీబీపేట(కామారెడ్డి)లో 2.8, నిజాంబాద్‌(రాజన్న సిరిసిల్ల)లో 2.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గురువారం రాష్ట్రంలోనే గరిష్ఠంగా నల్గొండలో 43 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. బుధవారం రాత్రి అత్యల్పంగా మెదక్‌లో 17.8 డిగ్రీలుంది. ఇది సాధారణంకన్నా 7.4 డిగ్రీలు తక్కువ. మే నెల వేసవికాలంలో ఇంత తక్కువ ఉష్ణోగ్రత నమోదవడం ఈ సీజన్‌లో ఇదే తొలిసారి. గాలిలో తేమ సాధారణంకన్నా 23 శాతం అదనంగా పెరిగింది. పగటి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటున్నా గాలిలో తేమ కారణంగా ఉక్కపోతలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

ఇదీ చదవండి: ఆక్సిజన్, రెమ్​డెసివర్, టీకా డోసులను ఇవ్వాలని సీఎం విజ్ఞప్తి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.