The High Court ordered the police: పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి ఇషాన్ శర్మ, శశాంక్ తాతినేని, ప్రతాప్‌ను వెంటనే హాజరుపరిచేలా ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మల్లు రవి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. అక్రమంగా నిర్బంధించారని బాధితులకు 20లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు.
ముగ్గురినీ ప్రశ్నించే ముందు సీఆర్‌పీసీ 41ఏ నోటీసులు ఇచ్చినట్లు హైకోర్టుకు పోలీసులు నివేదించారు. నాలుగు వారాల్లో పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ పిటిషన్‌పై విచారణ వాయిదా వేసింది.
ఇవీ చదవండి: