రాష్ట్ర ప్రభుత్వం మరో నాలుగు బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టింది. గతంలో జారీ చేసిన ఆర్డినెన్స్‌ల స్థానంలో ఈ బిల్లులను తీసుకొచ్చింది. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్టసవరణ బిల్లు, ఆయుష్ వైద్యుల పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచే బిల్లు, విపత్కర పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించే బిల్లు, 1435 కోట్ల రూపాయల అదనపు అప్పు తీసుకునే వెసులుబాటు కల్పించే బిల్లులు ఇందులో ఉన్నాయి.
ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లును విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సభలో ప్రవేశపెట్టగా... మిగతా మూడు బిల్లులను ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు తరపున పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ ప్రవేశపెట్టారు.
ఇదీ చూడండి : 'కొత్త సచివాలయ నిర్మాణం... సుప్రీం తీర్పునకు విరుద్ధం'