రాష్ట్రంలో ఐదుగురు ఐపీఎస్ అధికారులను బదీలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మణుగూరులో ఖాళీగా ఉన్న ఏఎస్పీ పోస్టుకు 2017 బ్యాచ్‌కు చెందిన శబరీశ్‌ను నియమించింది.
ఏటూరు నాగారం ఏఎస్పీగా ఉన్న శరత్ చంద్ర పవార్‌ను రామగుండం అదనపు డీసీపీగా బదిలీ చేసి ఆ స్థానంలో గౌస్ అలాంను నియమించింది. భద్రాచలం ఎఎస్పీగా ఉన్న రాజేశ్ చంద్రను ఆదిలాబాద్ ఏఎస్పీగా బదిలీ చేసి ఆ స్థానంలో 2017 బ్యాచ్‌కు చెందిన వినీత్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
- ఇదీ చూడండి: రాష్ట్రంలో పలువురు మున్సిపల్ కమిషనర్ల బదిలీ