రాష్ట్రంలో బీసీల స్థితిగతులపై సమగ్ర అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని బీసీ కమిషన్‌ను... ప్రభుత్వం ఆదేశించింది. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ బీసీ కమిషన్ విధివిధానాలపై మంగళవారం ఉత్తర్వులు (జీవో నెం.9) జారీ చేసింది. రాష్ట్రంలోని వెనకబడిన తరగతుల వారి వృత్తులు, సాధకబాధకాలను వెల్లడిస్తూ వాటి పరిష్కారానికి సూచనలు ఇవ్వాలని ఆదేశించింది.
సంప్రదాయ వృత్తులతో బీసీల జీవన విధానం ఎలా ఉందో వివరించడంతోపాటు వృత్తుల నవీకరణకు అవకాశాలను నిర్దేశించాలంది.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలు, ప్రైవేటు సంస్థల్లో బీసీ ఉద్యోగుల శాతాలపై సమాచారం సేకరించాలని పేర్కొంది. స్థానిక సంస్థల వెనకబాటుతనం, వాటిల్లో అవసరమైన రిజర్వేషన్లపై నివేదించాలని సూచించింది.
ఇదీ చదవండి: Tiger Stay Package: ఫారెస్ట్‌లో ఓ రోజు ఉండాలనుకుంటున్నారా..? ఈ ప్యాకేజీ మీకోసమే..