ETV Bharat / state

TS schools reopen : రేపటి నుంచి బడులకు ఉపాధ్యాయులు - తెలంగాణ 2021 వార్తలు

వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలను పునఃప్రారంభిస్తున్నందున.. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బంది గురువారం నుంచి విధులకు హాజరు కావాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు.

the-government-has-directed-teachers-to-come-to-schools-from-tomorrow
రేపటి నుంచి బడులకు ఉపాధ్యాయులు
author img

By

Published : Aug 25, 2021, 7:01 AM IST

ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బంది గురువారం (ఈ నెల 26వ తేదీ) నుంచి ప్రతి రోజూ అందరూ విధులకు హాజరు కావాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలను పునఃప్రారంభిస్తున్న నేపథ్యంలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి ఆమె కలెక్టర్లు, విద్యాశాఖ, పంచాయతీరాజ్‌శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఎలాంటి సమస్యలొచ్చినా పరిష్కరించాలి...

ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను ఈ నెల 30లోగా సిద్ధం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. జిల్లాల్లో ఎలాంటి సమస్యలు ఉత్పన్నమైనా పరిష్కరించే బాధ్యత జిల్లా స్థాయి ఎడ్యుకేషన్‌ మానిటరింగ్‌ కమిటీలదేనని స్పష్టం చేశారు. పారిశుద్ధ్యం పరంగా అన్ని చర్యలు తీసుకున్నామని ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు ధ్రువపత్రాలు సమర్పించాలన్నారు. పాఠశాలలు, వసతిగృహాల్లో మధ్యాహ్న భోజనం అందించేందుకు సరకులను సమకూర్చాలని కలెక్టర్లను ఆదేశించారు. విద్యాశాఖ అధికారులు ప్రైవేట్‌ విద్యాసంస్థలను సైతం పర్యవేక్షించాలన్నారు.

పిల్లలను రమ్మని ఒత్తిడి చేయొద్దు..

విద్యార్థులు తప్పనిసరిగా ప్రత్యక్ష తరగతులకు హాజరు కావాలని, విద్యా సంస్థలకు రావాలని ఒత్తిడి తేవొద్దని ఆయా యాజమాన్యాలకు మంత్రులు సూచించారు. కొవిడ్‌ మార్గదర్శకాలను పాటించడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని స్పష్టం చేశారు. విద్యార్థులు ఎవరైనా అనారోగ్యం బారిన పడితే వైద్య పరీక్షలు జరపాలని, కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయితే వారి తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకంగా వైద్య పరీక్షలు చేయిస్తామని మంత్రులు వెల్లడించారు. సమావేశంలో పంచాయతీరాజ్‌, విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ రఘునందన్‌రావు, రాష్ట్ర పురపాలక, ఇంటర్‌ విద్యాశాఖ కమిషనర్లు సత్యనారాయణ, జలీల్‌, పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన పాల్గొన్నారు.

ఇదీ చూడండి: TS EAMCET RESULTS: నేడు ఎంసెట్ ఫలితాలు విడుదల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.