ETV Bharat / state

ఎస్​బీఐ లేడీస్​ క్లబ్​ ఆధ్వర్యంలో ఫన్​ అండ్​ ఫుడ్​ కార్యక్రమం

The fun and food program in Hyderabad: ఎలాంటి లాభపేక్ష లేకుండా నడుస్తున్న స్వచ్ఛంద సంస్థ ఎస్​బీఐ లేడీస్​ క్లబ్​. ఈ క్లబ్​ సభ్యులు కొన్ని కార్యక్రమాలు నిర్వహించి వచ్చిన డబ్బులను సేవా కార్యక్రమాలకు వినియోగిస్తారని అధ్యక్షురాలు నుపుర్ జింగ్రాన్ తెలిపారు. అదే విధంగా ఫన్​ అండ్​ ఫుడ్​ కార్యక్రమాన్ని నిర్వహించారు.

sbi
sbi
author img

By

Published : Jan 31, 2023, 2:16 PM IST

The fun and food program in Hyderabad: హైదరాబాద్​లోని ఎస్​బీఐ లేడీస్ క్లబ్ హైదరాబాద్ సర్కిల్ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఫన్ అండ్ ఫుడ్ కార్యక్రమం విశేషంగా ప్రజలని ఆకట్టుకుంది. బంజారాహిల్స్​లోని ఎస్​బీఐ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఎస్​బీఐ లేడీస్ క్లబ్ అధ్యక్షురాలు నుపుర్ జింగ్రాన్ ప్రారంభించారు.

Fun and food program under the auspices of SBI Ladies Club
ఎస్​బీఐ లేడీస్​ క్లబ్​ ఆధ్వర్యంలో ఫన్​ అండ్​ ఫుడ్​ కార్యక్రమం

ఇందులో భాగంగా రుచికరమైన ఆహార స్టాల్స్​, అందమైన వస్త్రాలతో కూడిన 55 స్టాల్స్​ని ఏర్పాటు చేశారు. స్థానికులు ఈ కార్యక్రమంలో ఉత్సహంగా పాల్గొన్నారు. వివిధ రకాల గేమ్స్ నిర్వహించారు. ఫుడ్​ ఐటమ్స్ కూడా సందర్శకులను మైమరిపించాయి. ఈ కార్యక్రమంలో వివిధ రకాల సాంప్రదాయపరమైన వస్తువులను ప్రదర్శించారు. నిర్వహకులు కూడా సరదాగా గేమ్స్ ఆడారు.

స్టాల్స్​లో ఉన్న ఉత్పత్తులను విక్రయించగా.. వాటి ద్వారా వచ్చిన మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నట్టు ఎస్​బీఐ లేడీస్ క్లబ్ సభ్యులు స్ఫష్టం చేశారు. ఈ సందర్భంగా ఎస్​బీఐ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఇది వరకే ఈ క్లబ్​ ఆధ్వర్యంలో కొన్ని సేవా కార్యక్రమాలను చేశారు.

చెవిటి, మూగ విద్యార్థులకు సాయం: కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌ మూసారాంబాగ్‌లో చెవిటి, మూగ విద్యార్థులకు భారతీయ స్టేట్‌ బ్యాంకు లేడీస్‌ క్లబ్‌ విభాగం చేయూత అందించేందుకు ముందుకొచ్చింది. ప్రత్యేక వైద్యశిబిరాన్ని నిర్వహించింది. ఫిన్​ అనే స్వచ్ఛంద సంస్థ చెవిటి, మూగ పిల్లల బాగోగులు చూసుకుంటోంది. ఎస్బీఐ సీజీఎం సతీమణి నూపుర్‌ జింగ్రాన్‌ ఆధ్వర్యంలో అక్కడ ఉన్న విద్యార్థులకు అవసరమైన వస్తు సామాగ్రి అందజేశారు. ప్రధానంగా వారికి అవసరమైన స్కూల్‌ బ్యాగ్‌లు, స్టేషనరీ, పుస్తకాలు, బెడ్‌షీట్లు, మాస్క్‌లు, శానిటైజర్లు, ఔషధాలను నూపుర్‌ జింగ్రాన్‌ పంపిణీ చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.