హైదరాబాద్ కొండాపూర్, మసీదుబండలో నూతనంగా ఏర్పాటు చేసిన లక్ష్యాస్ నేచురల్ ఫుడ్స్ వారి ఆర్గానిక్ సూపర్ మార్కెట్‌ను మాజీ మంత్రి జూపల్లి కృష్ణ రావుతో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. నగర ప్రజలకు నాణ్యమైన ఆహారపు పదార్థాలు అందించాలన్న లక్ష్యంతో ఆర్గానిక్ సూపర్ మార్కెట్‌ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు.
పంటపొలాల్లో ప్రకృతి సేద్యంతో పండించిన వస్తువులు, పండ్లు, కూరగాయలు విక్రయించడం జరుగుతుందన్నారు. ఆరోగ్య పరిరక్షణకు సేంద్రీయ ఆహారం ఎంతో అవసరమని తెలిపారు.