నిబంధనలకు విరుద్ధంగా హాంగ్‌కాంగ్‌కు వజ్రాలు ఎగుమతి చేసిన కేసులో ఎంబీఎస్ జ్యూవెలర్స్‌పై ఈడీ భారీ జరిమానా విధించింది. ఫెమా నిబంధనల ఉల్లంఘన కింద ఎంబీఎస్ జ్యూవెలర్స్‌కు రూ.222కోట్లు, దాని డైరెక్టర్ సుఖేశ్ గుప్తాకు రూ.22కోట్లు జరిమానా విధించారు. సుఖేశ్ గుప్తాపై ఇదివరకే రూ.216 కోట్ల లావాదేవీల్లో కేసు నడుస్తోందని ఈడీ అధికారులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి హాంగ్‌కాంగ్‌కు వజ్రాలు ఎగుమతి చేసిన కేసులోనూ నిందితుడిగా ఉన్నారని పేర్కొన్నారు.
2013లో హాంగ్‌కాంగ్‌కు చెందిన లింక్ ఫై లిమిటెడ్ కంపెనీకి రూ.220 కోట్లు విలువ చేసే వజ్రాలను విక్రయించానని.... దానికి సంబంధించిన సొమ్ము రావాల్సి ఉందని సుఖేశ్ గుప్తా వెల్లడించినట్లు ఈడీ అధికారులు తెలిపారు. లింక్ ఫై కంపెనీతో... సుఖేష్ గుప్తాకు గల సంబంధాలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు.
ఇదీ చూడండి: ధరణిలో ఆస్తుల వివరాల నమోదుపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు