TSPSC CASE Investigation: టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాలు లీకేజ్ కేసు విషయంలో నిందితులుగా ఉన్న ప్రవీణ్, రాజశేఖర్, డాక్యా నాయక్, రాజేశ్వర్‌లను సిట్ అధికారులు కస్టడీ విచారణ ముగిసింది. మూడు రోజుల కస్టడీలో భాగంగా నలుగురిని విచారించిన పోలీసులు కేసుతో సంబంధం ఉన్న మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు. కస్టడీ ముగిసిన తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం కింగ్ కోఠి ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు.
అనంతరం వారిని వైద్య పరీక్షల నిమిత్తం నిందితులను కోఠి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నలుగురు నిందితులకు ఏప్రిల్ 11 వరకూ 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించగా వారిని చంచల్ గూడ జైలుకు తరలించారు. మరో వైపు కమిషన ఉద్యోగులైన షమీమ్, రమేష్, సురేష్ లను పోలీసులు 7రోజులు కస్టడీకి కోరగా.. కోర్టు వారిని 5రోజుల కస్టడీకి అనుమతించింది. చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న వారిని రేపు కస్టడీకి తీసుకుని హమాయత్ నగర్‌లోని సిట్ కార్యాలయంలో విచారించనున్నారు. ఈ కేసులో మరో ముగ్గురికి ఐదు రోజుల కస్టడీ విధించింది కోర్టు. నాంపల్లి ధర్మాసనం సురేశ్, రమేశ్, షమీమ్‌ను కస్టడీకి అనుమతించింది. రేపటి నుంచి ముగ్గురికి 5 రోజుల పాటు కస్టడీలో ఉండనున్నారు.
బీజేవైఎం నేతలకు బెయిల్: ప్రశ్న పత్రం లీక్ అవ్వడంతోన ఈ నెల 14న బీజేవైఎం నేతలు టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలిపారు. దీంతో పరిస్థితులు గందరగోళంగా మారినందున పలువురు బీజేఎం నాయకులను, కార్యకర్తలు 10 మందిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అందులో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ కూడా ఉన్నారు. వీరికి ఈరోజు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసి.. కొన్ని షరతులను పెట్టింది.
నాంపల్లి కోర్టు విధించిన షరతులు ఏమిటంటే:
- ప్రతి 3వ ఆదివారం బేగంబజార్ పోలీసుల ముందు హాజరు కావాలని ఆదేశించింది.
- అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని షరతులు విధించింది.
ఈ రోజు విచారణ ఇలా జరిగింది:
ఈరోజుతో కస్టడీ అయిపోతునందున నిందితుల దగ్గర నుంచి వీలైనంత మేర సమాచారం రాబట్టేందుకు సిట్ అధికారులు ప్రయత్నించారు. ప్రవీణ్, రాజశేఖర్, డాక్యా, రాజేశ్వర్‌లను పోలీసులు సీసీఎస్ నుంచి సిట్ కార్యాలయానికి ఉదయం తీసుకొచ్చారు. మధ్యాహ్నం వరకు ప్రశ్నించి ఆ తర్వాత కోఠి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించి నాంపల్లి కోర్టులో నలుగురు నిందితులను హాజరుపర్చారు. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు.
టీఎస్పీఎస్సీలో పనిచేస్తున్న ఏఎస్ఓ ప్రవీణ్ ద్వారా ఏఈ ప్రశ్నాపత్రం కొనుగోలు చేసిన రేణుక.. దాన్ని ఆమె భర్త డాక్యా, సోదరుడు రాజేశ్వర్ నాయక్‌కు అందించిందని తెలుసుకున్నారు. డాక్యా, రాజేశ్వర్ నాయక్ కలిసి చాలా మందికి ప్రశ్నాపత్రాలు అమ్మేందుకు ప్రయత్నించారు. రేణుకకు తెలియకుండా పలువురితో బేరసారాలు కొనసాగించినట్లు సిట్ దర్యాప్తులో స్పష్టం అయింది. నిందితుడు డాక్యా తన విభాగంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పనిచేసే టెక్నికల్ అసిస్టెంట్లతో బేరం కుదుర్చుకున్నట్లు అధికారులు గుర్తించారు. డాక్యా ఇచ్చిన సమాచారం ఆధారంగా రాజేందర్, తిరుపతయ్యతో పాటు ప్రశాంత్‌లను సిట్ అధికారులు ఇదివరకే అరెస్ట్ చేశారు.
ఇవీ చదవండి: