ETV Bharat / state

కొత్తసారసాల ఘటనను ఖండించిన సీపీఐ

కొత్తసారసాల గ్రామంలో అటవీ అధికారులపై అధికారపార్టీ నాయకులు జరిపిన దాడిని సీపీఐ తీవ్రంగా ఖండించింది. అటవీ భూముల నుంచి ఆక్రమణ పేరుతో స్థానికులను వెళ్లగొట్టడం సరైన పద్ధతికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

చాడ వెంకట్‌ రెడ్డి
author img

By

Published : Jun 30, 2019, 11:09 PM IST

కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్​ కొత్తసారసారలో అటవీ అధికారులపై అధికారపార్టీ నాయకులు జరిపిన దాడిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి ఒక ప్రకటనలో ఖండించారు. అటవీ భూముల నుంచి ఆక్రమణ పేరుతో స్థానికులను వెళ్లగొట్టడం సరైన పద్ధతికాదని అన్నారు. పట్టణాలలో కబ్జాలకు గురైనా పట్టించుకోని ప్రభుత్వం, గ్రామాలలో పేదల జీవితాలతో ఆడుకోవడం దారుణమన్నారు. హరితహారం పేరుతో ఒక పక్క ప్రభుత్వం పోడు భూముల్లో చెట్లను నాటించాలని ఆదేశించటం, మరోవైపు గిరిజనులను బలవంతంగా పంపించడం అన్యాయంగా పేర్కొన్నారు.

ఇవీ చూడండి: నా తమ్ముడు దాడి చేయలేదు: ఎమ్మెల్యే కోనప్ప

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.