ETV Bharat / state

కరోనా నివారణలో పోలీస్​శాఖ చర్యలు భేష్ : కేంద్ర బృందం - పోలీస్​ శాఖ కరోనా నియంత్రణ

కరోనా నివారణ, ప్రజలకు నిత్యావసరాలను అందుబాటులో ఉంచడానికి పోలీస్ శాఖ చేపట్టిన చర్యలను కేంద్ర బృందం ప్రశంసించింది. 3 రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్​కి వచ్చిన కేంద్ర బృందం... రాష్ట్ర డీజీపీతో సమావేశమై లాక్​డౌన్ అమలు తదితర అంశాలపై ఆరా తీసింది.

Central Team Visit
Central Team Visit
author img

By

Published : Apr 26, 2020, 5:07 PM IST

తెలంగాణలో కరోనా ప్రభావం, లాక్ డౌన్ అమలు తదితర అంశాలపై క్షేత్ర స్థాయిలో వివరాలు తెలుసుకునేందుకు 3 రోజుల పర్యటనలో భాగంగా భారత ప్రభుత్వ జలశక్తి శాఖ అదనపు కార్యదర్శి అరుణ్ బరోకా, పబ్లిక్ హెల్త్ సీనియర్ స్పెషలిస్ట్ డా.చంద్రశేఖర్​, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ డైరెక్టర్ డా. హేమలత, జాతీయ కన్జ్యూమర్ అఫైర్స్​ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఎస్. ఎస్. ఠాకూర్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్​మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ శేఖర్ చతుర్వేది లతో కూడిన కేంద్ర బృందం నగరానికి వచ్చింది. ఆదివారం డీజీపీ మహేందర్​ రెడ్డితో భేటీ అయింది.

కరోనా నివారణ చర్యలపై పీపీటీ ద్వారా వివరణ

కరోనా నియంత్రణకై పోలీస్ శాఖ చేపట్టిన చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పీపీటీ) ద్వారా కేంద్రబృందానికి పోలీసులు వివరించారు. లాక్​డౌన్ సమయంలో ప్రజలు బయటకు రాకుండా చేపట్టిన జాగ్రత్తలను తెలిపారు. కేవలం హైదరాబాద్​లోనే నిబంధనలు అతిక్రమించిన లక్షకు పైగా వాహనాలను జప్తు చేసినట్లు చెప్పారు. పాజిటివ్ కేసుల గుర్తింపు, ట్రేసింగ్ విధానం, కంటైన్మెంట్​ జోన్లలో భద్రతా వంటి అంశాలను కేంద్ర బృందానికి వివరించారు.

పోలీస్​ శాఖకు ప్రశంసలు

రాష్ట్రంలో లాక్​డౌన్ అమలుకు పోలీస్ శాఖ చేపట్టిన చర్యలు, నిత్యావసరాల పంపిణీ, కంటైన్మెంట్ ప్రాంతాల్లో, ఆస్పత్రులు, ఐసోలేషన్ కేంద్రాల వద్ద బందోబస్తు వంటి విషయాలపై తెలంగాణ పోలీసు యంత్రాంగం చేపట్టిన చర్యలను కేంద్ర బృందం ప్రశంసించింది.

ఇదీ చదవండి: కరోనా వేళ 'మూర్తీ'భవించిన మానవత్వం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.