ETV Bharat / state

సెక్షన్​ 29పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తర్జనభర్జన - non return filers

జీఎస్టీ రిటర్న్‌లు సక్రమంగా అమలు చేయని వ్యాపార, వాణిజ్య సంస్థల రిజిస్ట్రేషన్లు రద్దు చేసే ప్రక్రియపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తర్జనభర్జన పడుతున్నాయి. జీఎస్టీ చట్టం సెక్షన్‌ 29ని ఉపయోగించి రద్దు చేయాలని కొన్ని రాష్ట్రాలు భావిస్తుండగా... కేంద్రం ఈ విషయంలో ఆచితూచి అడుగులు ముందుకేస్తోంది. అక్రమాలకు పాల్పడే వ్యాపార, వాణిజ్య సంస్థలకు ఇది ఊతమిచ్చినట్లవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుండడంతో... రిటర్న్‌లు దాఖలు చేయని సంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై కేంద్రం తీవ్ర కసరత్తు చేస్తోంది.

సెక్షన్​ 29పై తర్జనభర్జన పడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
author img

By

Published : Nov 22, 2019, 2:32 PM IST

'ఒకే దేశం, ఒకే పన్ను' నినాదంతో వచ్చిన వస్తు సేవల పన్ను అమలులో ఎదురవుతున్న చిక్కులను అధిగమించేందుకు జీఎస్టీ మండలి కృషి చేస్తోంది. వ్యాపార, వాణిజ్య సంస్థలతో పాటు ఆయారాష్ట్రాలు, వివిధ స్వచ్ఛంద సంస్థల నుంచి వచ్చే వినతులను నిశితంగా పరిశీలిస్తుంది. రాష్ట్రాలకు, కేంద్రానికి ఆమోదయోగ్యమైన అంశాలపై నిర్ణయాలు తీసుకుంటుంది.
లొసుగులే ఆసరా...
జీఎస్టీ అమలు వ్యవహారమంతా ఆన్‌లైన్‌ ప్రక్రియ కావడంతో... కొందరు అక్రమార్కులు దానిలోని చిన్నపాటి లొసుగులను ఆసరా చేసుకుని పన్నులు ఎగ్గొడుతున్నారు. బోగస్‌ సంస్థలను ఏర్పాటు చేసుకుని లావాదేవీలు నిర్వహించకుండానే నకిలీ ఇన్‌ వాయిస్‌లను జీఎస్టీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసి... ప్రభుత్వం నుంచి రాయితీ పొందుతున్న కేసులు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ఈ విషయంలో అప్రమత్తమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అక్రమార్కులపై నిఘా ఉంచి వారి పని పడుతున్నాయి.
జీఎస్టీ రాబడులపై ప్రభావం...
అక్రమార్కుల భరతం పడుతున్నా.. అసలు రిటర్నులు ఫైల్ చేయని వారిపై మాత్రం ఇంకా యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. 2017 జులైలో వస్తు సేవల పన్ను అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ కొన్ని వ్యాపార, వాణిజ్య సంస్థలు రిటర్న్‌లు వేయలేదు. గడువులు ఎప్పటికప్పుడు పొడిగించుకుంటూ వచ్చినా ఆశించిన ప్రయోజనం కనిపించడం లేదు. దేశ వ్యాప్తంగా కోటి 20 లక్షల వ్యాపార, వాణిజ్య సంస్థలు నెలవారీగా కాని, మూడు నెలలకు ఒకసారికాని తమ వ్యాపారాలకు సంబంధించిన ఇన్‌వాయిస్‌లను జీఎస్టీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంది. కానీ చేయట్లేదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో 81.41లక్షలు, మేలో 80.14లక్షలు, జూన్‌లో 75.79లక్షలు, జులైలో 75.80లక్షలు, ఆగస్టులో 75.94లక్షలు, సెప్టెంబరులో 73.83 లక్షలు లెక్కన రిటర్న్‌లు వచ్చాయి. ఈ ఆరు నెలల సగటు తీసుకుంటే నెలకు 77లక్షలే రిటర్న్‌లు వచ్చాయి. ఫలితంగా ప్రభుత్వానికి రావల్సిన పన్నులు కూడా వసూలు కావడం లేదు. ఈ ప్రభావం జీఎస్టీ రాబడులపై పడుతోంది.
జీఎస్టీ నమోదు రద్దు...
జీఎస్టీ దాఖ‌లు చేయ‌ని వారిపై ప్ర‌భుత్వం కఠిన‌ చ‌ర్య‌లు తీసుకునేందుకు సిద్ధ‌మైంది. అంచ‌నాల కంటే త‌క్కువ‌గా వ‌సూళ్లు న‌మోద‌వుతుండ‌టంతో సీబీఐసీ, జోన‌ల్ కార్యాల‌యాల‌కు రిట‌ర్నులు దాఖ‌లు చేయ‌నివారిపై చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిగా ఆదేశాలిచ్చింది. ఆరు లేదా అంత‌కంటే ఎక్కువ గ‌డువుల‌కు సంబంధించిన జీఎస్టీఆర్-3బి రిట‌ర్నులు దాఖ‌లు చేయ‌నివారికి జీఎస్టీ న‌మోదు ర‌ద్దు చేయడంతో పాటు సెక్ష‌న్ 29, సీజీఎస్‌టీ చ‌ట్టం కింద చ‌ర్య‌లు తీసుకోనున్నారు.
అలా చేస్తే వారికే లాభమా?
ఎలాంటి చర్యలు లేకుండా రిజిస్ట్రేషన్లు రద్దు చేయడం ద్వారా... ఆయా సంస్థలు ఆరు నెలల పాటు వ్యాపారం చేసుకున్నా... రిటర్న్‌లు దాఖలు చేయరు. అంతే కాకుండా... కొత్త పేర్లతో తిరిగి రిజిస్ట్రేషన్‌ చేయించుకుని అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రిటర్న్‌లు వేయని సంస్థలపై నిఘా ఉంచి... చట్టపరమైన చర్యలు తీసుకునేట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా ముందుకు వెళ్లడం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి ఎలాంటి ప్రత్యామ్నాయం ఆలోచిస్తాయో వేచి చూడాల్సి ఉంది.

ఇవీ చూడండి: 'ప్రైవేటు సంస్థల్లో ఆధార్ ధ్రువీకరణ చట్టబద్ధమేనా?'

TG_HYD_03_22_CENTRAL_STATES_THINKIMG_ON_NON_RETURN_FILERS_PKG_3038066 Reporter: Tirupal Reddy ()జిఎస్టీ రిటర్న్‌లు సక్రమంగా వేయని వ్యాపార, వాణిజ్య సంస్థల రిజిస్ట్రేషన్ల రద్దు చేసే ప్రక్రియపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తర్జనభర్జన పడుతున్నాయి. జిఎస్టీ చట్టం సెక్షన్‌ 29ని ఉపయోగించి రద్దు చేసే ప్రక్రియను అమలు చేయాలని కొన్ని రాష్ట్రాలు బావిస్తుండగా కేంద్రం ఈ విషయంలో ఆచితూచి అడుగులు ముందుకేస్తోంది. అక్రమాలకు పాల్పడే వ్యాపార, వాణిజ్య సంస్థలకు ఇది ఊతమిచ్చినట్లు అవుతుందన్నఅభిప్రాయం వ్యక్తం అవుతుండడంతో రిటర్న్‌లు దాఖలు చేయని సంస్థలపై ఏలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై కేంద్రం ఆరా తీస్తోంది. LOOK వాయిస్ఓవర్‌1: ఒకే దేశం, ఒకే పన్ను అన్న నినాదంతో అమలులోకి వచ్చిన వస్తు సేవల పన్నుఅమలులో ఎదురవుతున్న చిక్కులను అధికమించేందుకు జిఎస్టీ మండలి కృషి చేస్తోంది. వ్యాపార, వాణిజ్య సంస్థలతోపాటు ఆయారాష్ట్రాలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార, వాణిజ్య సంఘాల నుంచి వచ్చే వినతులను నిశితంగా పరిశీలిస్తూ అన్ని రాష్ట్రాలకు, కేంద్రానికి ఆమోదయోగ్యమైన అంశాలపై నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. జిఎస్టీ అమలు వ్యవహారం అంతా కూడా ఆన్‌లైన్‌ ద్వారా జరిగే ప్రక్రియ కావడంతో కొందరు అక్రమార్కులు ఇందులోని చిన్నపాటి లొసుగులను ఆసరా చేసుకుని అక్రమాలకు పాల్పడుతున్నారు. బోగస్‌ సంస్థలను ఏర్పాటు చేసుకుని వ్యాపార లావాదేవీలను నిర్వహించకుండానే నకిలీ ఇన్‌ వాయిస్‌లను జిఎస్టీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసి ప్రభుత్వం నుంచి జిఎస్టీ రాయితీ పొందుతున్న కేసులు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ఈ విషయంలో అప్రమత్తమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు...అక్రమార్కులపై నిఘా ఉంచి పని పడుతున్నాయి. వాయిస్ఓవర్‌2: తాజాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కొత్త చిక్కు వచ్చి పడింది. 2017 జులై నుంచి వస్తు సేవల పన్నుఅమలులోకి వచ్చినప్పటికీ ఇప్పటికీ...కొన్ని వ్యాపార, వాణిజ్య సంస్థలు రిటర్న్‌లు వేయలేదు. గడువులు ఎప్పటికప్పుడు పొడిగించుకుంటూ వచ్చినా ఆశించిన ప్రయోజనం కనిపించడం లేదు. దేశ వ్యాప్తంగా కోటి 20 లక్షలు వ్యాపార, వాణిజ్య సంస్థలు నెలవారీగాకాని, మూడు నెలలకు ఒకసారికాని తమ వ్యాపారాలకు చెందిన ఇన్‌వాయిస్‌లను జిఎస్టీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంది. కాని వేయడం లేదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో 81.41లక్షలు, మేలో 80.14లక్షలు, జూన్‌లో 75.79లక్షలు, జులైలో 75.80లక్షలు, ఆగస్టులో 75.94లక్షలు, సప్టెంబరులో 73.83లక్షలు లెక్కన వ్యాపార, వాణిజ్య సంస్థలు తమ వ్యాపారాలకు చెంది రిటర్న్‌లు వేశాయి. ఈ ఆరు నెలల సగటు తీసుకుంటే నెలకు 77లక్షల ప్రకారం రిటర్న్‌లు వచ్చాయి. మిగిలిన వ్యాపార వాణిజ్య సంస్థలు రిటర్న్‌లు వేయడం లేదు...దీంతో ప్రభుత్వానికి రావల్సిన పన్నులు కూడా వసూలు కావడం లేదు. ఈ ప్రభావం జిఎస్టీ రాబడులపై పడుతోంది. క్రమంగా తగ్గుతోంది. 20శాతానికిపైగా వ్యాపార, వాణిజ్య సంస్థలు రిటర్న్‌లు దాఖలు చేయడం లేదన్న నిర్ణయానికి వచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తర్జనభర్జనలు పడుతున్నాయి. వాయిస్ఓవర్‌3: వస్తు సేవల పన్ను సెక్షన్‌ 29 ఏమి చెబుతోందంటే....కాంపోజిషన్‌ స్కీమ్‌లో ఉన్న వ్యాపారులు వరుసుగా మూడు సార్లు రిటర్న్‌లు దాఖలు చేయకపోయినా...సాధారణ వ్యాపార, వాణిజ్య సంస్థలు వరుసుగా ఆరు నెలలు రిటర్న్‌లు దాఖలు చేయకపోయినా ఆయా సంస్థల రిజిస్ట్రేషన్లు రద్దు చేయవచ్చని స్పష్టం చేస్తోంది. అదే విధంగా ఏ వ్యాపార, వాణిజ్య సంస్థ అయినా ఉద్దేశ పూరితంగా మోసం చేయడం, కావాలని వాస్తవాలను దాచడం లాంటి అంశాల ఆదారంగా కూడా ఆయా సంస్థల రిజిస్ట్రేషన్‌ రద్దు చేయవచ్చని వెల్లడిస్తోంది. అయితే చట్టంలోని ఈ నిబందనలను దృష్టిలో ఉంచుకుని కొన్ని రాష్ట్రాలు రిటర్న్‌లు వేయని సంస్థల రిజిస్ట్రేషన్లు రద్దు చేయడం మొదలు పెట్టగా కేంద్రం మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలపై ఆరా తీస్తోంది. ఇలా రద్దు చేయడం వల్ల అక్రమాలకు పాల్పడే వ్యాపార, వాణిజ్య సంస్థలకు ఊతం ఇచ్చినట్లు అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏలాంటి చర్యలు లేకుండా రిజిస్ట్రేషన్లు రద్దు చేయడం ద్వారా...ఆయా సంస్థలు ఆరు నెలలపాటు అక్రమ వ్యాపారం నిర్వహించి...రిటర్న్‌లు దాఖలు చేయకుండా కొత్త పేర్లతో తిరిగి రిజిస్ట్రేషన్‌ చేయించుకుని అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో ఏ సంస్థలైతే రిటర్న్‌లు వేయడం లేదో...ఆయా సంస్థలపై నిఘా ఉంచి చట్టపరమైన చర్యలు తీసుకునేట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా ముందుకు వెళ్లడం మంచిదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తర్జన, భర్జనలు పడుతున్నాయి. దీనికి ఏలాంటి ప్రత్యామ్నాయం ఆలోచిస్తాయో వేచి చూడాల్సి ఉంది.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.