హైదరాబాద్‌లోని నల్లకుంటకు చెందిన కె.బాలాజీ పురుషోత్తం 40 ఏళ్లుగా ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. దేశభక్తి ఎక్కువగా ఉన్న ఆయన.. భారత 50వ స్వాతంత్య్ర దినోత్సవం నుంచి నేటి వరకు 24 ఏళ్లుగా ప్రతి ఆగస్టు 15న ప్రయాణికులను తన ఆటోలో ఉచితంగా గమ్యస్థానాలకు తరలిస్తూ సేవలు అందిస్తున్నారు. తమ వద్ద ఉన్న ఓ నోటు పుస్తకంలో ప్రయాణికుల అభిప్రాయాలు కూడా సేకరిస్తున్నారు.
ఆగస్టు 15 ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం జెండా అవనతం చేసే వరకూ బాలాజీ పురుషోత్తం ఈ ఉచిత సేవలు అందిస్తున్నారు. ఏపీలోని మచిలీపట్నానికి చెందిన ఈ ఆటో డ్రైవర్.. హైదరాబాద్‌లో నాలుగు దశాబ్దాలుగా ఆటో నడపుతూ జీవనాధారం పొందుతున్నారు.
40 ఏళ్లుగా ఆటో నడిపిస్తున్నాను. 50వ స్వాతంత్య్ర దినోత్సవం నుంచి నా ఆటోలో ప్రయాణికులను ఒకరోజు ఫ్రీగా గమ్యస్థానాలకు చేర్చుతున్నాను. ఎందుకంటే వాళ్లతోటే నాకు బతుకుదెరువు దొరుకుతుంది కాబట్టి.. వారికోసం ఒకరోజు ఇలా సేవ చేస్తున్నాను. 24 సంవత్సరాలుగా ఈ ఉచిత సేవను కొనసాగిస్తున్నాను.- బాలాజీ పురుషోత్తం, ఆటో డ్రైవర్.
ఇదీ చూడండి: CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 245 కరోనా కేసులు.. ఒకరు మృతి