దేశంలో ఆర్థిక మాంద్యం కొనసాగుతున్నా... రాష్ట్రంలో వృద్ధిరేటు బాగుందని వాణిజ్య పన్నులు, పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. వాణిజ్య పన్నులు, పశుసంవర్థక శాఖ పద్దులపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు. గొల్లకురుమలు బలోపేతం కావాలని గొర్రెపిల్లల పంపిణీ చేస్తున్నామన్న మంత్రి... ఈనెల 25నుంచి రెండో విడత పంపిణీ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కాళేశ్వరం నీటిరాకతో చేపలఉత్పత్తి 4రెట్లు పెరుగుతుందన్నారు. ఈ మేరకు చేపల ఎగుమతికీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి తలసాని తెలిపారు.
ఇవీ చూడండి:'రెవెన్యూ సంస్కరణలతో పాలన ప్రజలకు చేరువైంది'