ETV Bharat / state

టీఎస్​పీఎస్సీ కార్యాలయం ముందు టీజీటీ అభ్యర్థుల ఆందోళన - తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్

హైదరాబాద్​ నాంపల్లిలోని టీఎస్​పీఎస్సీ కార్యాలయం ముందు టీజీటీ మెరిట్​ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. టీజీటీలో ఏర్పడ్డ ఖాళీలను మెరిట్​ అభ్యర్థులతో భర్తీ చేయాలని కమిషన్​ను డిమాండ్​ చేశారు.

tgt candidates protested at tspsc in hyderabad
టీఎస్​పీఎస్సీ కార్యాలయం ముందు టీజీటీ అభ్యర్థుల ఆందోళన
author img

By

Published : Oct 6, 2020, 6:39 PM IST

టీజీటీ(ట్రైన్డ్​ గ్రాడ్యుయేట్ టీచర్) పోస్టులలో ఏర్పడ్డ ఖాళీలను భర్తీ చేయాలంటూ టీజీటీ మెరిట్ అభ్యర్థులు.. హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. 2017లో టీఎస్​పీఎస్సీ నిర్వహించిన టీజీటీ అర్హత పరీక్షలో తాము మెరిట్ సాధించామని.. 1:1 ఎంపిక ద్వారా తాము ఉద్యోగం కోల్పోయామని అన్నారు. టీజీటీ ఉద్యోగానికి ఎంపికైన వారిలో కొంతమంది వేరే పోటీ పరీక్షలకు అర్హత సాధించారని.. దాని కోసం ఈ ఉద్యోగానికి రాజీనామాలు చేశారని వివరించారు.

అలా టీజీటీలో కొన్ని ఖాళీలు ఏర్పడ్డాయని.. ఆ ఖాళీలను తదుపరి మెరిట్ సాధించిన తమకు కేటాయించాలని పలుమార్లు కమిషన్​ను కోరామని తెలిపారు. ఏళ్లు గడుస్తున్నా ఖాళీగా ఉద్యోగాలను భర్తీ చేయకుండా.. నిరుద్యోగులకు మనోవేదన మిగిలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కమిషన్ ఈ విషయంలో స్పందించి ఖాళీ పోస్టులను మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి: ప్రభుత్వరంగ సంస్థల బకాయిలే రూ.200కోట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.