Pawan Kalyan Ippatam Tour: ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన ముగిసింది. ఉద్రిక్తతల మధ్య పవన్‌కల్యాణ్ ఇప్పటం గ్రామ పర్యటన సాగింది. ఇప్పటం గ్రామంలో కూల్చివేసిన నివాసాలను పవన్ పరిశీలించిన పవన్ బాధితులను పరామర్శించి వారి వివరాలు తెలుసుకున్నారు. జనసేన సభకు స్థలం ఇచ్చామనే కక్షతో ఇళ్లు కూల్చారని స్థానికులు ఆరోపించారు. ఇళ్లు కోల్పోయిన బాధితులకు అండగా ఉంటామని పవన్‌కల్యాణ్ హామీ ఇచ్చారు. బాధితుల తరఫున న్యాయం పోరాటం చేస్తామన్నారు. కాకినాడ లేదా రాజమహేంద్రవరమా రోడ్లు వెడల్పు చేయడానికి అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఆర్కే ఇల్లు ఉన్న పెదకాకానిలో రహదారి విస్తరణ లేదా? అని నిలదీశారు. కనీసం మాట్లాడనీయకుండా ఆపడానికి మీరెవరు? తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
"ఇళ్లు కోల్పోయిన బాధితులకు అండగా ఉంటాం. బాధితుల తరఫున న్యాయం పోరాటం చేస్తాం. కాకినాడ లేదా రాజమహేంద్రవరమా రోడ్లు వెడల్పు చేయడానికి?. ఎమ్మెల్యే ఆర్కే ఇల్లు పెదకాకానిలో రహదారి విస్తరణ లేదా?. కనీసం మాట్లాడనీయకుండా ఆపడానికి మీరెవరు?." -పవన్‌కల్యాణ్
జనసేన సభకు ఇప్పటం గ్రామస్థులు స్థలం ఇచ్చారనే కుట్రచేస్తున్నారని ఆరోపించారు. మార్చిలో సభకు భూమిస్తే.. ఏప్రిల్‌లో ఇళ్లు కూల్చేస్తామని నోటీసులు ఇచ్చారని పవన్ అన్నారు. ఇడుపులపాయలో తామూ హైవే వేస్తామని పవన్ చెప్పారు. గుంతలు పూడ్చలేరు.. రోడ్లు వేయలేరుగానీ విస్తరణ కావాలా? అని దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వానికి బుద్ధి ఉందా.. తామేమన్నా గూండాలమా? అని మండిపడ్డారు. అత్యాచారాలు చేసిన వారిని పోలీసులు వదిలేస్తున్నారని.. కూల్చివేస్తున్న వారికి పోలీసులు కొమ్ముకాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దోపిడీలు చేసేవారికి అండగా ఉంటున్నారన్నారు. రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
"మా సభకు ఇప్పటం గ్రామస్థులు స్థలం ఇచ్చారనే కుట్రచేస్తున్నారు. మార్చిలో సభకు భూమిస్తే.. ఏప్రిల్‌లో ఇళ్లు కూల్చేస్తామని నోటీసులు ఇచ్చారు. వైకాపా వాళ్లు ఇలానే చేస్తే మీ ఇళ్ల నుంచి హైవే వేస్తాం. గుంతలు పూడ్చలేరు.. రోడ్లు వేయలేరుగానీ.. విస్తరణ కావాలా?. ఈ ప్రభుత్వానికి బుద్ధి ఉందా.. మేమేమన్నా గూండాలమా?. అత్యాచారాలు చేసిన వారిని పోలీసులు వదిలేస్తున్నారు. కూల్చివేస్తున్న వారికి పోలీసులు కొమ్ముకాస్తున్నారు. దోపిడీలు చేసేవారికి అండగా ఉంటున్నారు. రాష్ట్రంలో రౌడీరాజ్యం నడుస్తోంది." -పవన్‌కల్యాణ్
పోలీసులు అడ్డుకున్నా మౌనంగా ముందుకెళ్లాలని శ్రేణులకు సూచించారు. పోలీసులు కూడా తమకు సోదరులే.. వాళ్ల కష్టాలు తమకు తెలుసునని తెలిపారు. పోలీసులను ఏమీ అనవద్దని.. చేతులు కట్టుకుని ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు చేసే పోరాటంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. అరెస్టులకు భయపడేది లేదని.. దేనికైనా సిద్ధమేనన్నారు. తమ మట్టిని కూల్చిన వైకాపా వాళ్ల కూల్చివేత తథ్యమని పవన్ అన్నారు.
"పోలీసులు అడ్డుకున్నా మౌనంగా ముందుకెళ్లాలని శ్రేణులకు సూచిస్తున్నా. పోలీసులు కూడా మాకు సోదరులే.. వాళ్ల కష్టాలు మాకు తెలుసు. పోలీసులను ఏమీ అనవద్దు.. చేతులు కట్టుకుని ముందుకు నడవండి. ప్రజాస్వామ్య పరిరక్షణకు చేసే పోరాటంలో వెనక్కి తగ్గేది లేదు. అరెస్టులకు భయపడేది లేదు.. దేనికైనా సిద్ధమే. వైకాపా వాళ్లకు చెబుతున్నా.. మా మట్టిని కూల్చారు... మీ కూల్చివేత తథ్యం." -పవన్ కల్యాణ్
కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తమ ఇళ్లను కూల్చివేశారని మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఇప్పటం గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనసేన సభకు స్థలం ఇచ్చినందుకు ఇళ్లు కూల్చివేస్తారా అంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న గ్రామంలో రోడ్డు వెడల్పు చేయాల్సిన అవసరం ఏంటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.
ఇవీ చదవండి: