ఒకరికి బదులు మరొకరు ఓటు వేస్తే దానిని టెండర్ ఓటు అంటారని మున్సిపల్ కమిషనర్ అండ్ డైరెక్టర్, ఎన్నికల అధికారి శ్రీదేవి తెలిపారు. టెండర్ ఓటు నమోదైతే వారికి మళ్లీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై కేసులుండటం, ఆస్తి పన్ను కట్టకపోవడం, వ్యయ పద్దులు సమర్పించక పోయినా అనర్హులుగా ప్రకటిస్తామన్నారు. నామినేషన్లను అభ్యర్థుల సమక్షంలో పత్రాలు పరిశీలించి అనర్హులుగా ప్రకటిస్తామని అన్నారు.
పురపోరుకు శాసనసభ ఎన్నికల కంటే పోలింగ్ కేంద్రాలను ఎక్కువగా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. అంతకు ముందు మేడ్చల్ నామినేషన్ కేంద్రంలో ఎక్కువ మంది ఉండటం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటర్నింగ్ అధికారి, సహాయ రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు ఎలా తీసుకుంటున్నారని అడిగి తెలుసుకున్నారు.
ఇదీ చూడండి : తెరాసను ఓడించి కేసీఆర్కు ఝలక్ ఇద్దాం : ఉత్తమ్