ETV Bharat / state

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో మెరిసిన తెలుగు తేజాలు

jee advanced results 2022: జేఈఈ అడ్వాన్స్​డ్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. జాతీయ స్థాయిలో మొదటి పది ర్యాంకుల్లో నాలుగింటిని తెలుగు విద్యార్థులు కైవసం చేసుకున్నారు. పీఎల్ సాయి లోహిత్ రెడ్డి 2వ ర్యాంక్​, వంగపల్లి సాయి సిద్ధార్థ 4వ , పి.కార్తికేయ 6వ, ధీరజ్ 8వ ర్యాంకు సాధించారు. వివిధ కేటగిరీల్లోనూ తెలంగాణ, ఏపీ విద్యార్థులు అగ్రస్థానాల్లో నిలిచారు. ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం రేపటి నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ జరగనుంది.

author img

By

Published : Sep 11, 2022, 2:40 PM IST

jee advanced results
jee advanced results

jee advanced results 2022: జేఈఈ అడ్వాన్స్​ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. జాతీయ స్థాయిలో ఓపెన్ కేటగిరీలో మొదటి పది ర్యాంకుల్లో నలుగురు తెలుగు విద్యార్థులే ఉన్నారు. పీఎల్ సాయి లోహిత్ రెడ్డి 2వ ర్యాంకు, వంగపల్లి సాయి సిద్ధార్థ 4, పి.కార్తికేయ 6, ధీరజ్ 8 వర్యాంకు సాధించారు. జాతీయ స్థాయిలో 24వ ర్యాంకు సాధించిన పల్లి జలజాక్షి ఐఐటీ మద్రాస్ జోన్ అమ్మాయిల విభాగంలో టాపర్​గా నిలిచారు. తొలి వంద ర్యాంకుల్లో సుమారు 20 మంది 500వ ర్యాంకుల్లో దాదాపు వంద మంది తెలంగాణ, ఏపీ విద్యార్థులు ఉన్నారు.

ఐఐటీల్లో ప్రవేశానికి ఆగస్టు 28న నిర్వహించిన పరీక్షా ఫలితాలను ఐఐటీ బాంబే ఈరోజు ఉదయం ప్రకటించింది. ఈ ఫలితాల్లో బాంబే జోన్​కు చెందిన ఆర్కే శిశిర్ 360 మార్కులకు 314 మార్కులు సాధించి మొదటి ర్యాంకును కైవసం చేసుకున్నాడు. దిల్లీ జోన్​కు చెందిన తనిష్క కబ్రా 277 మార్కులతో బాలికల్లో టాపర్‌గా నిలిచింది. ఆమె ఆల్ ఇండియాలో 16వ ర్యాంక్ సాధించింది. ఆగస్టు 28న జరిగిన జేఈఈ అడ్వాన్స్​డ్​ పరీక్షకు 1.50 వేల మంది హాజరయ్యారు. వారిలో 40 వేల మంది అర్హత సాధించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.