ETV Bharat / state

గల్ఫ్‌ దేశాల్లో తెలుగువారి ఆందోళన

గల్ఫ్‌ దేశాల్లో తెలుగువారు కష్టాల కడలిలో మునిగిపోతున్నారు. ప్రధానంగా ప్రవాస భారతీయ ఉద్యోగ, కార్మికులపై లాక్​డౌన్​ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల వారితోపాటు అధిక శాతం భారతీయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు కుటుంబాల్లో వారు ఆందోళన చెందుతున్నారు. వారిని ఆదుకోవాలని కోరుతున్నారు.

author img

By

Published : Apr 13, 2020, 10:07 AM IST

Telugu people's concern in Gulf countries
గల్ఫ్‌ దేశాల్లో తెలుగువారి ఆందోళన

సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌... కువైట్‌... ఒమన్‌... ఖతార్‌... ఇవన్నీ చాలామంది తెలుగువారికి సుపరిచితమైన గల్ఫ్‌ దేశాలు. వాటి అన్నింటా కలిపి 15 లక్షల మంది వరకు తెలుగు రాష్ట్రాలవారున్నారు. ఆయా దేశాల్లోని ఆయిల్‌ కంపెనీలు, గ్యాస్‌ స్టేషన్లు, నిర్మాణ సంస్థలు, హోటళ్లు, పర్యాటక ప్రాజెక్టులు, ఐటీ పరిశ్రమలు, రోడ్‌వేస్‌, ప్యాకింగ్‌ రంగాల్లో ఉపాధి పొందుతున్నారు. ఇళ్లల్లో, వివిధ క్షేత్రాల్లో కార్మికులుగా ఉన్నారు. దాదాపు రెండున్నర లక్షన్నర మంది కుటుంబాలతో జీవిస్తున్నారు. కరోనా మహమ్మారి గల్ఫ్‌ దేశాల్లోనూ కోరలు చాచి సృష్టిస్తున్న పెను సమస్యలు అక్కడి తెలుగు వారిని గందరగోళంలోకి నెట్టేశాయి.

బహరైన్‌ మినహా...

సౌదీలో 50 వేలు, యూఏఈలో 45 వేలు, కువైట్‌లో 25 వేలు. ఖతార్‌లో 15 వేలు, ఒమన్‌లో 9 వేలు, బహరైన్లో ఆరున్నర వేల దాకా తెలుగు కుటుంబాలున్నాయి. ఇవి గాక కుటుంబ సభ్యులను తెలుగు రాష్ట్రాల్లోనే ఉంచి.. ఒంటరిగా వెళ్లిన వారు లక్షల మంది ఉన్నారు. బహరైన్‌ మినహా మిగిలిన దేశాల్లో భారీఎత్తున కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య భారీగా ఉంటోంది. ఆయా దేశాల ఆర్థిక స్థితిపై, జీవనంపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. అక్కడి ఆయిల్‌ కంపెనీలను మూసివేశారు. వలస వెళ్లి అక్కడ కుటుంబాలతో సహ ఉంటున్న తెలుగువారు ఇళ్లవద్దనే ఉండిపోతున్నారు. ప్రసిద్ధ సంస్థలు జీతాలు ఇస్తున్నాయి. నిర్మాణ సంస్థల్లో కొన్ని మాత్రమే వేతనాలు చెల్లించాయి.

తీవ్ర ఆందోళన..

కరోనా ఎన్ని రోజులు ఉంటుందో, తమ ఉద్యోగాలేమిటనే దానిపై గల్ఫ్‌లోని తెలుగువారిలో తీవ్ర ఆందోళన నెలకొంది. గల్ఫ్‌ దేశాలకు రాకపోకలను నిషేధించారు. అక్కడి మన తెలుగువారు ప్రస్తుతానికి సొంత ప్రాంతాలకు తిరిగి వచ్చే పరిస్థితి లేదు. కరోనా వ్యాప్తికి ముందు గల్ఫ్‌ దేశాలకు చాలా మంది విజిటింగ్‌ వీసాలపై వెళ్లారు. దాదాపు పది వేల మంది ఆయా దేశాల్లోనే ఉండిపోయారు. ఈ పరిస్థితుల్లో అక్కడ తెలుగువారు... ఇక్కడ వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

కంపెనీలు మూతపడుతున్నాయి

కరోనాతో కంపెనీలు మూతపడుతున్నాయి. ఈ సంక్షోభం త్వరగా ముగియాలని కోరుకుంటున్నాం. ఇక్కడి ప్రభుత్వం భారత్‌కు వెళ్లేందుకు అనుమతించినా. మనవారు విమానాలు లేక ఇక్కడే ఉండిపోతున్నారని కువైట్‌లో ఉన్న గొడిశాల అభిలాష చెబుతున్నారు.

అప్రమత్తంగా బహరైన్‌

బహరైన్‌లో వ్యాధి నియంత్రణలో ఉంది. ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. ఇతర గల్ఫ్‌ దేశాల పరిస్థితిని చూసి ఇక్కడి కుటుంబాలు కంగారు పడుతున్నాయని బెహరైన్‌లో ఉన్న రాదారపు సతీశ్‌ అంటున్నారు.

రాకపోకలు ఎప్పుడో?

ఉపాధి, ఉద్యోగాల గురించి వచ్చి ఇక్కడ స్థిరపడ్డాం. కరోనా అందరి ఆశలను, అంచనాలను తలకిందులు చేసింది. కరోనా వల్ల రాక పోకలపై నిషేధం వల్ల... చాలా అనిశ్చితి నెలకొని ఉంది. కరోనా పరిస్థితుల్లో ఉపాధి కోల్పోయి తిరిగి వచ్చే వారికి ఉపాధి మార్గాలు చూపాలి. లేదా ఏదైనా ప్రత్యేక ప్యాకేజి ద్వారా ఆదుకోవాలని ఖతార్‌లో ఉన్న అబ్బగాని శ్రీధర్‌ వివరించారు.

దిక్కుతోచడం లేదు

యూఏఈలో కేసుల ఉద్ధృతిపై భయం ఏర్పడుతోంది. తెలుగు కుటుంబాల వారికి దిక్కుతోచడం లేదు. అక్రమంగా నివసిస్తున్న వారికి గతంలో క్షమాభిక్ష ప్రకటించినప్పుడు దుబాయ్‌ నుంచి 600 మంది స్వరాష్ట్రాలకు వెళ్లిపోయారు. ఇప్పుడు పనులున్న వారే మిగిలారు. కంపెనీలు మూతపడడడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

ఇదీ చూడండి : రూ. 1500కే కరోనా పరీక్ష.. రెండున్నర గంటల్లో ఫలితం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.