Rare Kidney Surgery: కీ హోల్ సర్జరీ ద్వారా కిడ్నీలోని 156 రాళ్లను తొలగించినట్లు ప్రీతీ యూరాలజీ, కిడ్నీ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. అయితే కిడ్నీ సాధారణ స్థానంలో ఉంటే ఇది అంత గొప్ప విషయం కాదని.. రోగికి ఎక్టోపిక్ కిడ్నీ ఉన్న కారణంగా శస్త్రచికిత్స అత్యంత అరుదైనదని స్పష్టం చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆస్పత్రి ఎండీ డాక్టర్ చంద్రమోహన్ సహా పలువురు వైద్యులు, రోగి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
హుబ్లీకి చెందిన 50 ఏళ్ల వ్యక్తి కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతూ గత నెల ఆస్పత్రికి వచ్చారని డా. చంద్రమోహన్ తెలిపారు. అయితే బాధితుడికి మూత్రకోశం సమీపంలో ఉండాల్సిన కిడ్నీ.. కడుపులో ఉందని చెప్పారు. దీంతో ఇది చాలా అరుదైన చికిత్స అని.. దాదాపు మూడు గంటలపాటు శ్రమించి ల్యాప్రోస్కోపిక్, ఎండోస్కోపీ విధానాలను పాటిస్తూ కీ హోల్ సర్జరీ చేశామని డాక్టర్. చంద్రమోహన్ వివరించారు.
ఇదీ చదవండి: Doctor Sridhar on Omicron Variant: 'ఒమిక్రాన్‌ను నిలువరించాలి లేదంటే మూడో ముప్పు తప్పదు'