TRS MLA Jeevan Reddy: ఎన్నికలు రాగానే ప్యాకేజీలు.. తర్వాత ప్యాకప్‌లు.. భాజపా విధానమని.. తెరాస ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆరోపించారు. రైతుల కోసం లక్షల కోట్లు ఖర్చు చేస్తున్న తెరాస ప్రభుత్వాన్ని విమర్శించడం మానుకోవాలని రాష్ట్ర భాజపా నేతలకు హితవు పలికారు. అన్నదాతల పట్ల ప్రేమ ఉంటే కాళేశ్వరం వంటి ప్రాజెక్టులకు నిధులు తీసుకురావాలని సూచించారు.
ఎన్నికలు రాగానే అన్ని పార్టీల నాయకులు రైతే రాజు అని అంటారు. ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ భాజపా.. ప్యాకేజీ పాలసీ తీసుకొస్తుంది. రేవంత్ రచ్చబండ.. కాంగ్రెస్ పార్టీకి ఉరి బండ. సరైన సమయంలో రైతులే వారికి బుద్ధి చెప్తారు. -జీవన్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే
కాంగ్రెస్ తీరుపైనా జీవన్ రెడ్డి మండిపడ్డారు. ధాన్యం సమస్యపై రేవంత్‌రెడ్డి పార్లమెంట్‌లో ప్రస్తావించకుండా విఫలమయ్యారని ఆరోపించారు. భాజపా, కాంగ్రెస్‌కు వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతవుతాయని జీవన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి: Minister Harish Rao: 'త్వరలోనే సిద్దిపేటను సీడ్ హబ్‌గా మారుస్తాం'