Governor Tamilisai at Robothan event: కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో రోబోలు ప్రముఖ పాత్ర పోషించాయని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అన్నారు. సికింద్రాబాద్ తిరుమలగిరి మిలటరీ ఇంజినీరింగ్ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఆధ్వర్యంలో జరిగిన.. ఇంటర్ కాలేజ్ రోబోటిక్ పోటీలకు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అత్యుత్తమ రోబోలను రూపకల్పన చేసిన విద్యార్థులు, కళాశాలలకు బహుమతులను అందజేశారు.
'కరోనా విపత్కర పరిస్థితుల్లో రోబోలు ప్రముఖ పాత్ర పోషించాయి. సంక్లిష్టమైన శస్త్ర చికిత్సలోనూ అద్భుతమైన పని తీరు కనబరిచాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నారు. వస్తువులను దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయికి భారత్ ఎదిగింది.' -తమిళిసై సౌందర రాజన్, తెలంగాణ గవర్నర్
ఆవిష్కరణలకు ప్రోత్సాహం
రోజురోజుకీ సాంకేతికత అభివృద్ధి చెందుతుందన్న గవర్నర్.. ప్రధాని మోదీ ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో ప్రతి వస్తువును దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ప్రస్తుతం ఎగుమతి చేసే స్థాయికి భారత్ ఎదుగుతోందని హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం యుద్ధంలో ఉపయోగిస్తున్న ఆయుధాలు కూడా మేకిన్ ఇండియాలో భాగంగా తయారు చేస్తూ ఉండటం గొప్ప విషయమని అన్నారు. ఈ పోటీల్లో మహాత్మా గాంధీ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్ ప్రథమ బహుమతి, యంఎల్ఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ద్వితీయ బహుమతి, హైదరాబాద్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తృతీయ బహుమతులు సొంతం చేసుకున్నాయి.
ఇదీ చదవండి: Bandi Sanjay on job notifications: 'ఎన్నికలు వస్తేనే నోటిఫికేషన్లు అంటూ సీఎం ఊదరగొడతారు'