ETV Bharat / state

భాగ్యనగర యువకుడు.. శకుంతలా దేవిని మించిన గణిత మేధావి - మైండ్ స్పోర్ట్స్ ఒలింపియాడ్ 2020

ఇటీవల లండన్​లో జరిగిన మైండ్ స్పోర్ట్స్ ఒలింపియాడ్‌లో పాల్గొని మెంటల్ కాలిక్యులేషన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలుచుకున్నాడు హైదరాబాద్​కు చెందిన 20 ఏళ్ల నీరకంఠ భానుప్రకాశ్. అంటే.. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన హ్యూమన్​ కాలిక్యులేటర్ అన్నమాట! మరి తన గురుంచి తెలుసుకుందామా?

Telangana's Neelakanta Bhanu Prakash bags 'World's Fastest Human Calculator' title
భాగ్యనగర యువకుడు.. శకుంతలా దేవిని మించిన గణిత మేధావి
author img

By

Published : Aug 25, 2020, 2:27 PM IST

Updated : Aug 25, 2020, 6:05 PM IST

భాగ్యనగర యువకుడు.. శకుంతలా దేవిని మించిన గణిత మేధావి

ప్రపంచంలో అత్యంత వేగవంతమైన మానవ కాలిక్యులేటర్‌గా హైదరాబాద్ యువకుడు నీలకంఠ భాను ప్రకాశ్ నిలిచారు. అంతేకాదు, ఈ టైటిల్ సాధించిన తొలి భారతీయుడిగానూ చరిత్ర సృష్టించారు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చదువుతోన్న భాను.. లండన్‌లో ఆగస్టు 15న జరిగిన మైండ్ స్పోర్ట్స్ ఒలింపియాడ్‌లో పాల్గొని మెంటల్ కాలిక్యులేషన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలుచుకున్నాడు.

ఐదేళ్ల నుంచే..

మైండ్ స్పోర్ట్స్ ఒలింపియాడ్‌ను 1998 నుంచి నిర్వహిస్తున్నారు. ఈ పోటీలో 13 నుంచి 50 ఏళ్లలోపు ఉన్న 13 దేశాలకు చెందిన 30 మంది పాల్గొన్నారు. ఇందులో భాను 65 పాయింట్లతో మొదటి స్థానం సాధించగా.. లెబనాన్, యూఏఈకి చెందిన యువకులు రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. నీల్‌కంఠ భాను ఐదేళ్ల వయసులోనే సిప్ అబాకస్ కార్యక్రమంలో పేరు నమోదు చేసుకుని, తొమ్మిది దశలను పూర్తిచేశాడు. అలాగే, ఇంటర్నేషనల్ అబాకస్ ఛాంపియన్​లో 13, నేషనల్ అబాకస్ ఛాంపియన్​లో 11, 12 టైటిళ్లను గెలుపొందాడు.

పుత్రోత్సాహం

తన కుమారుడు భారతదేశానికి గర్వకారణంగా మారినందుకు భాను తండ్రి శ్రీనివాస్ జొన్నలగడ్డ సంతోషం వ్యక్తం చేశారు, గణితమంటే ఉన్న భయాన్ని నిర్మూలించాలనే దిశగా భాను పయనిస్తున్నట్లు ఆయన తెలిపారు. పిల్లల మెదడుకి శిక్షణా వంటి టెక్నిక్స్​ను నేర్పిస్తూ వారిని గణితం నేర్చుకునేందుకు ప్రోత్సహించాలని ఆయన సూచించారు.

'గణిత వైభవాన్ని తిరిగి తేవాలి'

భారతీయ గణితానికి గత వైభవాన్ని తిరిగి తీసుకురావాలని...ఇందుకోసం గణితాన్ని ఓ క్రీడగా భావించి ప్రోత్సహించాలని భానుప్రకాశ్​ ప్రభుత్వాన్ని కోరారు. భారతదేశంలో అత్యుత్తమ మేధస్సు కలిగిన అధ్యాపకులు ఉన్నారని.. సర్కారు అండతో మనం ఇప్పటివరకు సాధించిన దానికంటే మరింత రాణిస్తామని ఆయన అభిప్రాయపడ్డారు.

"విజన్ మ్యాథ్​" ప్రయోగశాలలను సృష్టించి.. దాని ద్వారా లక్షలాది మంది పిల్లలను చేరుకోవాలని భాను అనుకుంటున్నారు. పిల్లలందరూ గణితాన్ని ప్రేమించడం ప్రారంభించేలా చేయడమే తన లక్ష్యమని ఆయన వెల్లడించారు. మ్యాథ్స్​ను ఓ క్రీడగా నేర్చుకుంటే రానున్న రోజుల్లో దేశానికి ఎన్నో బంగారు పతకాలు వస్తాయని భాను ప్రకాశ్ తెలిపారు.

ఇదీ చదవండి: కరోనా వ్యాక్సిన్ల రేసులో ప్రపంచ దేశాల పరుగు.!

Last Updated : Aug 25, 2020, 6:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.