రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే శుక్రవారం రాష్ట్యవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. తూర్పు- పశ్చిమ షేర్ జోన్ వెంట 3.1 కి.మీ నుంచి 5.8 కిలో మీటర్ల ఎత్తు మధ్య ఉపరితల ద్రోణి ఏర్పడిందని.. ఇది ఎత్తుకు వెళ్లేకొద్దీ దక్షిణ దిశ వైపునకు తిరగనుందని పేర్కొంది.
మరఠ్వాడ నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఇంటీరియర్ కర్ణాటక మీదుగా 1.5 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడినట్లు వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. ఉత్తర బంగాళాఖాతం ప్రాంతాల్లో సుమారుగా ఆగస్టు 4న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వెల్లడించింది.
ఇదీ చూడండి: భారత్కు రఫేల్- వాయుసేనకు కొత్త శక్తి