ETV Bharat / state

Telangana Transport Department Revenue Increased : రాష్ట్ర రవాణా శాఖలో కాసుల వర్షం - రవాణా శాఖ

Telangana Transport Department Revenue 2023 : రాష్ట్ర రవాణా శాఖలో కాసుల వర్షం కురుస్తుంది. గడిచిన మూడేళ్లతో పోలిస్తే.. ఈ ఏడాది భారీగా ఆదాయం సమకూరింది. ఈ ఏడాది ఏకంగా రూ.6,390.80 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత మూడేళ్ల ఆదాయంతో పోలిస్తే ఇది రెండింతలు అధికంగా ఉన్నట్లు రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రవాణా శాఖకు రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరడంతో ఆ శాఖ ఉన్నతాధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Telangana Transport Department Revenue Increased

author img

By

Published : Jun 8, 2023, 7:10 AM IST

Updated : Jun 8, 2023, 7:21 AM IST

Revenue of Telangana Transport Department increased : ఆదాయపరంగా రాష్ట్ర రవాణా శాఖ దూసుకెళ్తోంది. పెరుగుతున్న వాహనాల సంఖ్య మరోవైపు పన్నుల మోతతో దాని ఆదాయం అంచనాలు దాటుతోంది. దీంతో రవాణా శాఖలో రికార్డు స్థాయిలో ఆదాయం వసూలైంది. గడిచిన మూడేళ్లతో పోలిస్తే.. భారీగా ఆదాయం సమకూరింది. రవాణా శాఖ అధికారులు పక్కా ప్రణాళికాబద్దంగా, సమిష్టిగా పనిచేయడంతోనే రికార్డు స్థాయి ఆదాయం సమకూరినట్లు తెలుస్తుంది. గ్రేటర్ హైదరాబాద్​తో పాటు, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా భారీ స్థాయిలో ఆదాయం సమకూరినట్లు తెలుస్తుంది.

Telangana Revenue Budget Analysis : ఏ ఏడాదికి ఆ ఏడాది రవాణా శాఖకు టార్గెట్​లు విధిస్తారు. కానీ.. ఈ ఏడాది టార్గెట్​కు మించి ఆదాయం సమకూరినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఏడాదిలో వాహనాల కొనుగోళ్లు పెరగడంతో పాటు, వివిధ ట్యాక్స్​ల వసూళ్లు భారీగా వసూలు చేశారు. పన్నులు కట్టకుండా తిరుగుతున్న వానదారులపై స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీం ప్రత్యేక దృష్టి సారించింది. కొన్నేళ్లుగా వాహనాల పన్నులు కట్టకుండా తిరుగుతున్న వారి నుంచి సైతం ఈసారి పన్నులు వసూలు చేశారు. గతేడాది మే నెలలో వాహనాల జీవితకాల పన్నును ప్రభుత్వం పెంచటంతో ఆదాయమూ భారీగా వృద్ధి చెందుతోంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాన్ని చేరుకోలేని రవాణాశాఖ.. ప్రస్తుత ఏడాదిలో మాత్రం ఆదాయార్జనలో పరుగులు పెడుతోంది.

Revenue Of Telangana Transport Department : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర రవాణా శాఖకు మొత్తం రూ.6,390.80 కోట్ల ఆదాయం సమకూరింది. మార్చి 17 నాటికి రూ.6,055 కోట్ల ఆదాయం వచ్చినట్టు ఆ శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.53 కోట్ల వాహనాల ద్వారా 2021-22లో రవాణా శాఖకు రూ.3,971 కోట్ల ఆదాయం వచ్చింది. పన్నులు కట్టకుండా తిరుగుతున్న వానదారుల నుంచి స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డ్రైవ్‌ ద్వారా రూ.63.58 కోట్లు వసూలు చేసినట్టు రవాణా శాఖ అధికారులు తెలిపారు.

Telangana Transport Department Revenue Increased : క్వార్టర్లీ ట్యాక్స్ ద్వారా రూ.198.70 కోట్లు, జీవిత కాల పన్ను ద్వారా రూ.699.65 కోట్లు, గ్రీన్ ట్యాక్స్ ద్వారా రూ.9.64 కోట్లు, ఫీజులతో రూ.83.02 కోట్లు, సేవ పన్నులతో రూ.33.10 కోట్లు, డిటెక్షన్​తో రూ.33.10 కోట్లు ఇలా కేవలం పన్నుల ద్వారానే రవాణా శాఖకు రూ.1,045.30 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత ఏడాది 2022 మే నాటికి కేవలం రూ.865.73 కోట్ల పన్నులు వసూలు అయితే, ఈ ఏడాది 2023 మే మాసాంతానికి రూ.1,045.30 కోట్లు వసూలైనట్లు తెలుస్తుంది. గత ఏడాది పన్నుల రూపంలో వసూలైన వాటితో పోల్చుకుంటే ఈ ఏడాది అదనంగా రూ.179.57 కోట్ల ఆదాయం రవాణా శాఖకు సమకూరింది.

ఇవీ చదవండి:

Last Updated : Jun 8, 2023, 7:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.