ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​ @9AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten telugu news
టాప్​ టెన్​ న్యూస్​ @9AM
author img

By

Published : Feb 22, 2022, 8:59 AM IST

  • ఆకస్మిక గుండెపోటు.. కారణాలు ఇవే

Heart Attack Causes: ఆధునిక జీవనశైలి గుండె ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఒకప్పుడు 65-70 ఏళ్ల వయసు వారిలో కనిపించే గుండె జబ్బులు.. ప్రస్తుతం 25-35 ఏళ్లలోనే దాడి చేస్తున్నాయి. గతంలో పోల్చితే యువతలో గుండె జబ్బులు పెరుగుతున్నాయనీ, ఆకస్మిక గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. మారుతున్న జీవనశైలి కారణంగా ఈ ముప్పు ఎక్కువవుతున్నట్లు విశ్లేషిస్తున్నారు.

  • నెల్లూరుకు గౌతమ్ రెడ్డి భౌతికకాయం

హఠాన్మరణం చెందిన ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతికకాయాన్ని ఇవాళ హైదరాబాద్‌ బేగంపేట విమానాశ్రయం నుంచి నెల్లూరుకు తరలించనున్నారు. ప్రభుత్వం అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసింది. గౌతమ్ రెడ్డి మృతి చెందినట్లు అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఉదయగిరిలో బుధవారం అంత్యక్రియలు అధికారిక లాంఛనాల మధ్య నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

  • మంచితనానికి నిలువెత్తు నిదర్శనం

పనిలో చురుకుతనం.. మాటల్లో సౌమ్యం... మంచితనానికి నిలువెత్తు నిదర్శనం.... ఇవన్నీ ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సుగుణాలు. వయసుతో సంబంధం లేకుండా ఎవరినైనా సరే ప్రేమగా చిరునవ్వుతో పలకరించే మనస్తత్వం ఆయనది. వివాద రహిత నాయకుడిగా ఉంటూ రాజకీయాల్లో అజాత శత్రువుగా పేరు పొందారు. ఫిట్‌నెస్‌కు అత్యంత ప్రాధాన్యమిస్తూ క్రమం తప్పకుండా కసరత్తు, జిమ్‌లో వర్కవుట్లు చేసేవారు.

  • బహిరంగసభలో ఆసక్తికర సన్నివేశం

సీఎం కేసీఆర్​ నారాయణఖేడ్​ పర్యటనలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. 2017లో మంత్రి హరీశ్​రావు ఆ ప్రాంతంలో పర్యటించినప్పటి జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ.. ఓ గిరిజన మహిళ గురించి ప్రస్తావించటం. ఆమె ఆ సభలోనే ఉండటం.. ఆమెను సీఎం కేసీఆర్​ వేదికపైకి పిలిపించుకుని.. పక్కనే కూర్చోబెట్టుకుని కాసేపు మాట్లాడటం.. ఇదంతా ఓ సినిమా సన్నివేశంలా జరిగింది.

  • యూపీలో ఎస్పీ, భాజపా హోరాహోరీ

ఉత్తర్​ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భాజపా, ఎస్పీ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. తొలి మూడు దశల్లో జాట్‌లు, ముస్లింలు, యాదవులు ప్రాబల్యం చూపగా.. తదుపరి దశల్లో స్థానిక అంశాలు కీలకంగా మారనున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

  • ప్రధాన ప్రచారాంశంగా 'రాజకీయ హింస'

Manipur Polls 2022: మణిపుర్‌ ఎన్నికల్లో ఈసారి రాజకీయ హింస కూడా ప్రచారాంశంగా నిలుస్తోంది. కాంగ్రెస్​తో పాటు ఎన్‌పీపీ అధ్యక్షుడు, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్‌ సంగ్మా ​ ఈ అంశాన్నే ప్రస్తావిస్తున్నారు.

  • ఎవరికీ భయపడం.. వెనకడుగు వేయం

Russia Ukraine crisis: రష్యా యుద్ధానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు ఆ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తాము ఎవరికీ భయపడేది లేదని స్పష్టం చేశారు. దౌత్యమార్గంలో శాంతియుతంగా సమస్య పరిష్కారానికి కట్టుబడి ఉన్నట్లు చెప్పారు.

  • గురక పెడుతున్నారా..?..

'గురకపెట్టి నిద్రపోతున్నాడు. ఎంత అదృష్టవంతుడో.' చాలామంది ఇలాగే గురకను గాఢనిద్రకు సూచనగా భావిస్తుంటారు. మంచి నిద్రలో ఉన్నప్పుడు గురకపెట్టే మాట నిజమే అయినా అన్నిసార్లూ ఇది మంచిదే అనుకోవటానికి లేదు. నిద్రలో కాసేపు శ్వాస ఆగిపోయే సమస్యకూ (అబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్‌ అప్నియా సిండ్రోమ్‌) సంకేతం కావొచ్చు. దీన్ని సకాలంలో గుర్తించి, చికిత్స తీసుకోకపోతే తీవ్ర పరిణామాలకు దారితీయొచ్చు.

  • కెప్టెన్‌గా సవిత.. సత్తా చాటిన బాక్సర్

ఎఫ్​ఐహెచ్​ మహిళల హాకీ ప్రొ లీగ్​ పోరులో బరిలో దిగే భారత జట్టుకు గోల్​కీపర్​ సవిత్​ కెప్టెన్​గా వ్యవహరించనుంది. కాగా, స్ట్రాంజా స్మారక బాక్సింగ్‌ టోర్నమెంట్లో సుమిత్‌ కుందు స్ఫూర్తిదాయక విజయాన్ని సాధించాడు.

  • చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఆ భావన

'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా విభిన్నంగా ఉంటుందని, సమస్యలన్నీ మర్చిపోయి హాయిగా నవ్వుకునేలా చేస్తుందని అన్నారు నటి రాధిక. శర్వానంద్‌, రష్మిక అద్భుతంగా నటించారని ప్రశంసించారు. ఈ చిత్రం విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మేకింగ్‌ పరంగా అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులొచ్చాయని పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.